A2Z सभी खबर सभी जिले की

ఆర్మ్డ్ రిజర్వు డిఎస్పీగా బాధ్యతలు స్వీకరణ

 

 

 

 

Related Articles

ఆర్మ్డ్ రిజర్వు డిఎస్పీగా ఈ. కోటి రెడ్డి ఆర్మ్ డ్ రిజర్వు కార్యాలయంలో సెప్టెంబరు 17న బాధ్యతలు చేపట్టారు. ఆర్మ్డ్ రిజర్వు పోలీసు విభాగంలో పని చేస్తున్న పలువురు పోలీసు అధికారులు డిఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి,శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, ఎఆర్ అడిషనల్ ఎస్పీ జి. నాగేశ్వరరావు, అదనపు ఎస్పీ (అడ్మిన్) పి. సౌమ్యలతలను మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేసారు.1996వ సంవత్సరంలో పోలీసుశాఖలోని ఆర్మ్ డ్ రిజర్వు విభాగంలో ఆర్ఎస్ఐగా ఎంపికైన ఈ. కోటి రెడ్డి,
2008లో రిజర్వు ఇన్స్ పెక్టరుగాను, 2022లో డిఎస్పీగా ఉద్యోగోన్నతులు పొందారు. 1996లో పోలీసు శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చి సి.ఎం.పిస్టల్ మరియు లేటు హీరాసింగ్ మెమోరియల్ గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం, నక్సల్స్ నియంత్రణ చర్యల్లోను, గుంటూరు, నరసారావుపేట ట్రాఫిక్, ఆక్టోపస్, డిజిపి కార్యాలయంలో సెంట్రల్ స్టోర్స్లోను, అనంతపురం పిటిసి వైస్ ప్రిన్సిపాల్గా సమర్ధవంతంగా పని చేసి, ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. విధుల్లో కనబర్చిన ప్రతిభకుగాను డిఎస్పీ ఈ. కోటి రెడ్డి వివిధ సందర్భాల్లో 54 క్యాష్ రివార్డులు, 56 జి.ఎస్.ఈ.లు, 25 కమెండేషన్స్, 2012లో ఎపి పోలీసు సేవా పతకం, 2021లో ఎపి పోలీసు ఉత్తమ సేవా పతకం, 2024 లో ప్రెసిడెంట్ పోలీసు మెడల్ను పొందారు.

 

Show More
Back to top button
error: Content is protected !!