
మెంటాడ,
మెంటాడ మండలం సచివాలయంలో బుధవారం “స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్” అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లోకప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి సచివాలయంలో నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా “స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్” పోస్టర్‌ను డాక్టర్ లోకప్రియ ఆవిష్కరించారు. అనంతరం మహిళలు, అంగన్వాడీ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలతో ఆరోగ్య సాక్షరతపై ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ జి.కల్పన మాట్లాడుతూ
ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, గుర్తించిన వ్యాధులకు సంబంధించి మందులు అందజేశారు. రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, పోషణ అభియాన్, ‘ఈట్ రైట్’ సదుపాయాలు, తల్లి–బిడ్డ సేవలు, వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాధి స్కానింగ్, మానసిక వైద్య సేవలు, ఆయుష్ వైద్య సదుపాయాలు వంటి అనేక సేవలు ఈ అభియాన్‌లో భాగమని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ సత్యనారాయణ, టిడిపి సీనియర్ నాయకులు రెడ్డి రాజగోపాల్, ఏ.ఎన్.ఎమ్. సంతోషి, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
