A2Z सभी खबर सभी जिले की

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రజలకు సేవలందించాలి

*అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశంలో - విశాఖ రేంజ్ డిఐజి గోపినాధ్ జట్టి, ఐపిఎస్..*

 

జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులతో అర్ధ
సంవత్సర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టు 23న నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి, ఐపిఎస్ ముఖ్య అతిధిగాను,
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీమతి ఎం.బబిత, జిల్లా కలెక్టరు డా.బి.ఆర్. అంబేద్కర్ అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ మాట్లాడుతూ – ఇటీవల నమోదవుతున్న
ఎన్.డి.పి.ఎస్. కేసుల్లో పలువురు విద్యార్థులు నిందితులుగా అరెస్టు అవుతున్నారన్నారు. ఎక్కువ కేసుల్లో విద్యార్ధులే గంజాయి వినియోగదారులుగా, సరఫరా చేసే వ్యక్తులుగా మారుతున్నారన్నారు. గంజాయికి అలవాటు పడిన వ్యక్తులను
ప్రాధమిక స్థాయిలోనే గుర్తించి, డీ-అడిక్షన్ సెంటర్స్కు పంపి, అవసరమైన వైద్యంను అందించాలన్నారు. డీ-అడిక్షన్ సెంటరుకు వెళ్ళడం, చికిత్స పొందడమన్నది తప్పుగా భావించనవసరం లేదన్న వాస్తవాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడుల్లోను, పోక్సో కేసుల్లో న్యాయ స్థానాల్లో శిక్షలు విధింపబడడంలో రాష్ట్రంలోనే విజయనగరం ప్రధమ స్థానంలో నిలిచిందని, అందుకు కృషి చేసిన జ్యుడిషియల్ అధికారులు, పోలీసు అధికారులను డిఐజి అభినందించారు. నేరాల నియంత్రణలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి, ప్రజలకు ఉత్తమంగా సేవలను
అందించాలన్నారు. సమాజానికి కీడు కలిగించే ప్రతీ అంశం గురించి సంబంధిత పోలీసు అధికారికి తెలియాలని,
అందుకు క్షేత్ర స్థాయిలో నిఘాను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మహిళలు బస చేసే ప్రైవేటు, ప్రభుత్వ హాస్టల్స్ లోను భద్రత ఏర్పాట్లును అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని, మహిళల భద్రతకు హాస్టల్స్లో సెక్యూరిటీ గార్డు, కాంపౌండ్
వాల్, సిసి కెమెరాలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వివిధ కేసుల్లో మహిళలకు, బాధితులకు పరిహారం సకాలంలో అందే విధంగా చూడాలన్నారు. సైబరు, సోషల్ మీడియా వేధింపులను నియంత్రించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సైబరు కేసులను దర్యాప్తు చేసేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యంను పోలీసు అధికారులు
మెరుగుపర్చుకోవాలన్నారు. అనధికారంగా ఆయుధాలు కలిగి ఉండడం చట్టరీత్యా నేరమని, శివారు గ్రామాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాలని, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో జాయింట్ ఆపరేషన్స్ చేపట్టాలని, మెంటల్ హెల్త్ యాక్ట్ను వినియోగిస్తూ, చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి అధికారులను
ఆదేశించారు.
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎం.బబిత మాట్లాడుతూ – మహిళలు బస చేసే హాస్టల్స్, హెూంలలో భద్రత ఏర్పాట్లును
పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. న్యాయ స్థానాల్లో ప్రాసిక్యూషను వేగవంతంగా పూర్తయ్యే విధంగా చూసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నియమించాలని జిల్లా కలెక్టరును కోరారు. నేరస్థులు న్యాయ స్థానాల్లో శిక్షింపబడేందుకు అభియోగ పత్రాలను దాఖలు చేయుటలో జాగ్రత్తలు తీసుకోవాలని, సాక్షులు తమ సాక్ష్యాలను సక్రమంగా చెప్పే విధంగా బ్రీఫ్ చెయ్యాలని, దర్యాప్తు అధికారులు సాక్ష్యం చెప్పే ముందు సిడి ఫైల్స్ ను ఒకసారి పరిశీలించాలన్నారు. ఎన్.డి.పి.ఎన్. కేసుల్లో ఇన్వెంటరీ, సీజర్ చేయుటలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని, సెప్టెంబరు 13న నిర్వహించే
లోక్ అదాలత్ విజయవంతం అయ్యే విధంగా చూడాలని పోలీసు అధికారులను కోరారు.

Related Articles

జిల్లా కలెక్టరు అండ్ మెజిస్ట్రేట్ డా.బి.ఆర్.అంబేద్కర్, ఐఎఎస్ మాట్లాడుతూ – జిల్లాలో పోలీసుశాఖ చక్కగా
పని చేస్తుందని, గత ఏడాది శ్రీ పైడితల్లమ్మ ఉత్సవంలో ఎటువంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమన్వయంతో పని చేసామన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం తక్షణమే మంజూరయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. రహదారి భద్రతను దృష్టిలో పెట్టుకొని, ప్రమాదాల నియంత్రణకు పోలీసుశాఖకు
అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని, జాతీయ రహదారిపై 66 సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రూ.5లక్షలను మంజూరు చేసామన్నారు. జిల్లాలో ప్రతీ పోలీసు స్టేషనుకు ఒక డ్రోన్ ను మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, త్వరలో జిల్లా పోలీసుశాఖకు 34 డ్రోన్స్ ను అందిస్తామన్నారు. రెవెన్యూ, పోలీసు సమన్వయంతో పని చేస్తూ,
ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. పోలీసుశాఖకు అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు సిద్ధంగా
ఉన్నామని జిల్లా కలెక్టరు డా. బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు.

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ మాట్లాడుతూ – అర్ధ సంవత్సరంలో నేరాల నమోదు తీరును, నేరాల నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యలను జిల్లా ఎస్పీ వివరించారు. గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టి, గంజాయి సేవించిన వారిపైనా, విక్రయించిన వారిపైనా, రవాణ, చిన్న మొత్తాల్లో సరఫరా చేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. డైనమిక్ వెహికల్ చెకింగును ప్రతీ రోజూ పది ప్రాంతాల్లో చేపడుతున్నా మని, ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామన్నారు. గంజాయి వ్యాపారాలకు పాల్పడుతున్న 18గ్యాంగులను గుర్తించి, వారిపై నిఘా పెట్టేందుకు గ్యాంగు ఫైల్స్ ను ప్రారంభించామన్నారు. తరుచూ గంజాయి రవాణకు పాల్పడుతున్న వ్యక్తులపై పిడి యాక్ట న్ను ప్రయోగించామని, పిట్ ఎన్.డి.పి.ఎస్.గా గుర్తించిన కేసుల్లో చర్యలు చేపడుతున్నామని, ఫైనాన్సియల్ ఇన్విస్టిగేషను చేపట్టి, నలుగురు నిందితులకు చెందిన సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసామన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల అనర్ధాలను వివరించేందుకు సంకల్పం కార్యక్రమం చేపట్టామన్నారు. సంకల్ప రధంతో క్షేత్ర స్థాయిలో మహిళల భద్రత, రహదారి భద్రత, శక్తి యాప్, సైబరు నేరాలు పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. మహిళ హాస్టల్స్ భద్రత ఏర్పాట్లును పర్యవేక్షించామన్నారు. మహిళల రక్షణకు సెల్ఫ్
డిఫెన్స్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రహదారి భద్రతలో భాగంగా బ్లాక్ స్పాట్స్ను సందర్శించి, ప్రమాదాల నియంత్రణకు కారణలను గుర్తించి, నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. మహిళల రక్షణ ప్రాధాన్యత కల్పిస్తున్నామని, 25 పోక్సో కేసుల్లోను, మరో 18 కేసుల్లో నిందితులు న్యాయస్థానాల్లో శిక్షింపబడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. నాన్
బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసామని, లోక్ అదాలత్లో ఈ సం.లో ఇప్పటి వరకు 7,278 కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టామని, పోలీసు సంక్షేమానికి జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివరించారు.
శక్తి యాప్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన షార్టు ఫిల్ను విశాఖ రేంజ్
డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ ఆవిష్కరించారు. ఈ షార్టు ఫిల్మ్ ను రూపొందించుటకు కృషి చేసిన అగ్గిరాజు, రూప
హారికలను అధికారులు ప్రత్యేకంగా అభినందించి, సాలువతో ఘనంగా సత్కరించారు. అదే విధంగా గంజాయి కేసుల్లో
ఫైనాన్సియల్ ఇన్విస్టిగేషను సమర్ధవంతంగా పూర్తి చేసిన ఎస్.కోట సిఐ వి.నారాయణమూర్తి, బొబ్బిలి రూరల్ సిఐ
కే.నారాయణరావు లకు రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు.
ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టు కమీషనరు డి.మణి కుమార్,
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనాధుడు, డి.ఎఫ్.ఓ. ఆర్. కొండలరావు, డి.ఎం. అండ్ హెచ్.ఓ. డా. జీవన్ రాణి, డి.ఈ.ఓ. కే.వి.రమణ, మున్సిపల్ అసిస్టెంట్ కమీషనరు కే.అప్పలరాజు, విజయనగరం డిఎస్పీ
ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలిజి. భవ్యా రెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు,
డిటిసి డిఎస్పీ ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, జైలుశాఖ, వుమన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, ఆర్ అండ్ బి, మెరైన్, డ్రగ్స్ కంట్రోల్ మరియు ఇతర శాఖలకు చెందిన అధికారులు, పలువురు సిఐలు, వివిధ పోలీసు
స్టేషనుల్లో ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!