A2Z सभी खबर सभी जिले की

విశాఖపట్నం పెందుర్తి నేషనలిస్ట్ జనశక్తి పార్టీ సమావేశం జయప్రదం

విశాఖపట్నం పెందుర్తి న్యూస్ టుడే

బుధవారం రోజున అనగా 10 తేదీన నిర్వహించిన నేషనల్ లిస్ట్ జనశక్తి పార్టీ సమావేశానికి ముఖ్య అతిథులుగా స్టేట్ మరియు సెంట్రల్ ముఖ్య అతిధులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని నేషనల్ లిస్ట్ జనశక్తి పార్టీ సభ్యులు మరియు ముఖ్య అతిధులు శ్రీనివాస్ గారు తన మిత్రులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడం జరిగింది. విశాఖపట్నం ఇంచార్జ్ ఏలూరు వెంకటరమణమూర్తి శర్మ రాబోతున్న ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని సభను నిర్వహించామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని తెలియజేశారు. కార్యక్రమం అనంతరం వచ్చిన తన మిత్రులకు సన్మాన కార్యక్రమాలను కూడా చేశారు. కొంతమందికి విద్యపరంగా మెడికల్ పరంగా సమస్యలు ఉన్నవారికి నేరుగా ధన సహాయాన్ని కూడా పార్టీ తరఫునుంచి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు సహకరించిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

Related Articles
Show More
Back to top button