
విజయనగరం పట్టణంలో శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబరు 7, సాయంత్రం కన్నుల పండుగగా ముగిసింది. సిరిమానోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ చేపట్టిన పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, ముందస్తు భద్రత, జాగ్రత్తా చర్యలు సత్ఫలితాలిచ్చాయి. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సిరిమాను వెంబడి మూడుసార్లు తిరిగి, శ్రేణులకు తగిన సూచనలు చేస్తూ, బందోబస్తు ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు.
సిరిమానోత్సవం ముగిసిన తరువాత భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ళులో బ్యారికేడ్లును ఒక క్రమ పద్దతిలో తొలగించి, వారు అన్ని మార్గాలలో వెళ్ళేందుకు అనుమతించారు. పోలీసుశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు సేవాదళ్ దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణిలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విశేషమైన సేవలందించి, ప్రజల మన్ననలు పొందారన్నారు. అదే విధంగా ఆకతాయిల వేధింపులు లేకుండా, వారిపై నిఘా వేసి, అదుపులోకి తీసుకోవడం, మహిళలకు రక్షణ కల్పించడం సత్ఫలితాలిచ్చాయన్నారు. జేబు దొంగతనాలు,
చైన్ స్నాచింగ్స్ జరగకుండా ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రైం బృందాలు పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో కలియ తిరుగుతూ, అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. డివైజ్లో పరిశీలించి, ఎటువంటి చెడు నడత లేదని నిర్ధారణ చేసుకున్న తరువాతనే వారిని విడిచి పెట్టడం కూడా సత్ఫలితాలిచ్చాయి.
సిరిమానోత్సవం అనంతరం సిబ్బంది విధుల నుండి వెళ్ళిపోకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టి, తమకు
కేటాయించిన స్థానం వద్దనే ట్రాఫిక్ రెగ్యులేషన్కు ప్రత్యేక చర్యలను పోలీసుశాఖ చేపట్టడం కూడా సత్ఫలితాలిచ్చింది.
సిరిమానోత్సవం సజావుగా, ప్రశాంత వాతావరణంలో ముగియుటకు అన్ని వర్గాల ప్రజల తమ వంతు సహకారాన్ని
పోలీసుశాఖకు అందించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. విద్యుత్, అటవీ, ఆరోగ్య, మున్సిపల్, ఫైర్,
రెవెన్యూ, దేవాదాయ మరియు ఇతర శాఖలు సమన్వయంతో పని చేసాయన్నారు. అదే కూడా విధంగా ప్రజలు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర జిల్లాల నుండి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది తమవంతు సహకారాన్ని పోలీసు శాఖకు అందించారని,
వారందరికి జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ అభినందించి, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఎటువంటి దొంగతనాలు జరగకుండా భక్తులను పోలీసు కంట్రోల్ రూం నుండి సిసి కెమెరాలను పరిశీలిస్తూ,
ఎప్పటికప్పుడు సంబంధిత పోలీసు అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయడం, పోలీసులు మఫ్టీలో పహారా కాయడం,
అనుమానితుల వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో చెక్ చేసి, వారు పాత నేరస్థులా? కాదా? అన్న విషయం
నిర్ధారణ కావడంతో ఎటువంటి దొంగతనాలు జరగలేదు. అన్ని ముఖ్య కూడళ్ళులో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను
తాత్కాలిక ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయడంతో సిసి ఫుటేజులను కమాండ్ కంట్రోల్ నుండే విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి,
జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించారు. సిసి
కెమెరాల ఫుటేజులు పరిశీలించి, రద్దీని బట్టి, మార్గాలను మళ్ళించడం జరిగిందన్నారు.
విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టి, జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ తోపాటు అదనపు ఎస్పీ పి.సౌమ్యలత,
ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, చింతూరు అదనపు ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, డిఎస్పీలు ఆర్.గోవిందరావు,
జి.భవ్యరెడ్డి, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, ఈ.కోటి రెడ్డి, బి.సీతారాం, షేక్ షాబాజ్ అహ్మద్, పలువురు సీఐలు,
ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తును పర్యవేక్షించి ఆయా ప్రాంతాలలో విధులు నిర్వహించే పోలీసు అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
చూడగలిగామన్నారు. పోలీసుశాఖకు సహకరించిన జిల్లా ప్రజానీకానికి జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ కృతజ్ఞతలు తెలిపారు.