తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలెర్ట్.
ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో
హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష.
దీని ప్రభావంతో రాత్రికి, రేపు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు అంచనా.
ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాల్లో అతిభారీ వర్షాలు హై అలెర్ట్ గా ఉండాలి.
రాత్రికి తీరం దాటిన ఈదురుగాలులకు ఆస్కారం.
ఈ రాత్రికి అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి.
ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి.
రోడ్డు మీద పడే చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలి.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలి.
వంశధార, నాగావళి వరదకు ఛాన్స్ ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.
ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి–హోం మంత్రి వంగలపూడి అనిత.


