A2Z सभी खबर सभी जिले की

జర్నలిస్టులకు అసెంబ్లీ, ప్రభుత్వ కార్యక్రమాలు, విజయవాడ దసరా బ్రహ్మోత్సవాల పాస్‌లు – ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్, తప్పుడు కేసులు & దాడుల

 

 

*గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి,*

మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్టు సోదరులు మరియు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ప్రతినిధుల తరపున మీ దృష్టికి కొన్ని అత్యంత కీలకమైన అంశాలను తీసుకువస్తున్నాము.

Related Articles

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ప్రథమమైనది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరే ప్రధాన వేదిక జర్నలిస్టులే. అయినప్పటికీ, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు గత ప్రభుత్వంలో ఉన్నట్లుగానే, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయి.

*ప్రధాన సమస్యలు:*

1. ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలకు, అసెంబ్లీ సమావేశాలకు కేవలం 30 మందికే పాస్‌లు జారీ చేయడం జర్నలిస్టుల పట్ల వివక్షకరమైనది.

2. చిన్న పత్రికలు – పెద్ద పత్రికలు అన్న తేడాతో వ్యవహరించడం అన్యాయం.

3. ప్రభుత్వ పథకాలను ఉచితంగా ప్రచారం చేస్తున్నా కూడా జర్నలిస్టులకు అవకాశాలు ఇవ్వడం లేదు.

4. విజయవాడ దసరా బ్రహ్మోత్సవాల పాస్‌లు కూడా జర్నలిస్టులకు పరిమిత సంఖ్యలో ఇవ్వడం వల్ల వార్తా కవరేజీ తీవ్రంగా ప్రభావితమవుతోంది.

5. జర్నలిస్టులపై తప్పుడు కేసులు, దాడులు, పోలీసుల దురుసు ప్రవర్తన ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

6. జర్నలిస్టులకు వాగ్దానం చేసిన ఇళ్ల స్థలాలు, రిస్క్ ఇన్సూరెన్స్, అక్రిడిటేషన్ కార్డులు ఇప్పటికీ మంజూరు కాలేదు.

7. గత ప్రభుత్వంలో లభించని ప్రయోజనాలు ఈ ప్రభుత్వంలోనైనా లభిస్తాయని ఆశించాం. కానీ 20 నెలలు గడిచినా మాటలకే పరిమితమై వాస్తవ చర్యలు ఒక్కటీ చేపట్టలేదు.

*మా విజ్ఞప్తులు:*

1. అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమంత్రి కార్యక్రమాలు, విజయవాడ దసరా బ్రహ్మోత్సవాలకు జర్నలిస్టులకు సమానంగా పాస్‌లు జారీ చేయాలి.

2. జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు, రిస్క్ ఇన్సూరెన్స్, అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి.

3. జర్నలిస్టులపై జరుగుతున్న తప్పుడు కేసులు, దాడులు నిలిపివేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలి.

4. వివక్ష చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకుని, జర్నలిస్టులకు గౌరవం మరియు రక్షణ కల్పించాలి.

5. ప్రభుత్వ సమాచారాన్ని అడ్డుకోకుండా ప్రజలకు చేరేలా జర్నలిస్టులకు పూర్తి సహకారం అందించాలి.

పై సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేపట్టవలసి వస్తుంది. ఇది ప్రభుత్వం ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

వినమ్రతతో,
……………………………………
*డా. బండి సురేంద్రబాబు*
Founder & National President –NATIONAL ACTIVE REPORTERS ASSOCIATION (NARA),
Chief Editor & Publisher – “వార్తా ప్రప్రంచం”

Show More
Back to top button
error: Content is protected !!