
రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాలతో రహదారి భద్రతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో బ్లాక్ స్పాట్స్, ముఖ్యకూడళ్ళు వద్ద విస్తృతంగా ‘డ్రంకెన్ డ్రైవ్’ తనిఖీలు చేపట్టామని, మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులపై ‘డ్రంకన్ డ్రైవ్’ కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఆగష్టు 13న తెలిపారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ మాట్లాడుతూ – రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాలతో రహదారి భద్రతకు జిల్లా వ్యాప్తంగా ఆగష్టు 4 నుండి 10 వరకు ‘డ్రంకెన్ డ్రైవ్’ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో మద్యం సేవించి వాహనం నడిపిన వాహనదారులపై ‘డ్రంకన్ డ్రైవ్’ 295 కేసులు నమోదు చేసామన్నారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలను నడపడం వలన కలిగే అనర్థాలను వాహనదారులకు వివరిస్తూ, కౌన్సిలింగ్ నిర్వహించారన్నారు. వాహనాలు నడిపే వాహనదారులు రహదారి భద్రత నియమాలు తప్పని సరిగా పాటించాలన్నారు. ప్రతీ ఒక్కరూ భద్రత ప్రమాణాలను పాటిస్తూ, సురక్షితంగా గమ్య స్థానాలు చేరుకోవాలన్నారు. రహదారి భద్రత నియమాలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపడం వలన ప్రమాదాలకు గురై, వారి ప్రాణాలకు ముప్పుగా మారుతుందన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్క వాహన దారుడు గుర్తించాలన్నారు. రహదారి ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 295 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులను నమోదు చేసి, వివిధ కోర్టుల్లో అభియోగ పత్రాలను దాఖలు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ ప్రత్యేక డ్రైవ్ను విజయనగరం డిఎస్పీ ఎం. శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, సంబంధిత సిఐలు పర్యవేక్షించారన్నారు.
