A2Z सभी खबर सभी जिले की

>అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ విశ్వ/సన్ వ్యాలీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి > అధికారుల మొద్దు నిద్ర వీడాలి

చీపురుపల్లి మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఈ విద్యా సంవత్సరం శ్రీ విశ్వ పాఠశాల పేరుతో తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిపై భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాయకులు వెళ్లి వివరణ కోరగా తమకు అధికారులు అండ ఉందని ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అడ్డగోలుగా వ్యవహరించారు. అది చాలదన్నట్టు ప్రభుత్వం విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల నిషేధించింది అన్న సర్కులర్ చూపించి మాకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాం అడగడానికి మీరెవరు అన్న చందంగా యాజమాన్యం ఘర్షణకు దిగింది. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా విద్యా యంత్రాంగం మాత్రం తమకి పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. గతంలో అదే ప్రాంతంలో సన్ వ్యాలీ పేరుతో ఉన్న పాఠశాలలో శ్రీ విశ్వ పాఠశాల వారు తరగతులు నిర్వహిస్తున్నారు. గతంలో సన్ పాఠశాలలో ఏడవ తరగతి వరకే అనుమతులు ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే వారిని శ్రీ విశ్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతికి జాయిన్ చేశారు. తమ పిల్లలను తమతో పంపించాలని తల్లిదండ్రులు అడుగుతున్న అధికారుల అండ తమకు ఉండడంతో తల్లిదండ్రులపై కూడా పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతుంది. దీంతోపాటు పాఠశాలకి జి ప్లస్ టు అనుమతులు మాత్రమే ఉన్న పాఠశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలో నెట్టే విధంగా మూడు నాలుగు అంతస్తులో హాస్టల్ ను నడుపుతుంది. కావున తక్షణమే జిల్లా విద్యా యంత్రాంగం సన్ వ్యాలి/ శ్రీ విశ్వ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు నాని, జగదీష్ , మరియు నాయకులు మధులత తదితరులు పాల్గొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!