
జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే విజయనగరం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు డిమాండ్స్ డేలో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్న నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు శివప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం పాతఅక్రిడిటేషన్ కార్డులను పొడిగించకుండా కొత్తకార్డులు మంజూరు చేయాలన్నారు.రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టు యూనియన్‌లకు ప్రాతినిథ్యం కల్పించాలని, కోరారు, సీనియర్ పాత్రికేయులు ఎలిశెట్టి సురేష్ కుమార్ మాట్లాడుతూ,
,వర్కింగ్ జర్నలిస్టులకు హెల్త్‌స్కీమ్ మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రమాధభీమా పథకం తక్షణమే అమలు చేయాలని, డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మహపాత్రో మాట్లాడుతూ
జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయాలని, విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న పాత్రికేయుల పించన్లను మనరాష్ట్రంలో ప్రారంభించాలని, కోరారు, ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు పంచాది అప్పారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని ,
జిల్లాలో యాంటీ అటాక్ కమిటీలు పునరుద్దరించాలని, రైల్వేపాస్‌లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్ కు
వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా చిన్న మధ్యతరహా పత్రికల అధ్యక్షులు కె జే శర్మ కలెక్టర్ అంబేద్కర్ కు . జర్నలిస్టులు సమస్యలను వివరించ