A2Z सभी खबर सभी जिले की

రాజ్యాంగ విరుద్ధ సర్క్యులర్ 30/67/2025 నీ తక్షణమే రద్దు చేయాలి పాఠశాలల్లో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం సిగ్గు చేటు

ప్రభుత్వ సర్క్యులర్ కాపీలను కలెక్టరేట్ ఆవరణలో దగ్దం చేసిన SFI నాయకులు

 

పాఠశాలల్లోకి విద్యార్ది సంఘాలను నిషేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్కులర్ 30/67/2025 నీ రద్దు చేయాలని కోరుతూ ఆ సర్కులర్ ప్రతులను కలెక్టరేట్ ఎదుట దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేష్ లు మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. విద్యా సంస్థల్లో విద్యార్ది సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు మనకి రాజ్యాంగం ఎప్పుడో ఇచ్చిందని దానిని రద్దు చేయడమేంటని విమర్శించారు. రాష్ట్రంలో పాఠశాలల్లో అనేక సమస్యలు పేరుకు పోయాయని విద్యాశాఖ మంత్రిగా వాటి మీద దృష్టి పెట్టాల్సిన నారా లోకేష్ గారు పాఠశాలలో విద్యార్థి సంఘాలను నిషేధించాలంటూ ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక సర్కులర్ జారీ చేయడం తన చేతకానితనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరని అదే విధంగా ఇటువంటి అడ్డగోలు సర్కులర్లతో విద్యార్థి సంఘాలను ,వారి పోరాటాలను అడ్డుకోలేరని హెచ్చరించారు. విద్యార్థి సంఘాలను నిషేధిస్తున్న ప్రభుత్వం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ఏ విధంగా అనుమతిస్తుందని ఎస్ఎంసి కమిటీలలో అధిక శాతం ఉండేది ఆ గ్రామ రాజకీయ నాయకులే కదా అని విమర్శించారు. పాఠశాల నిధులని దోచుకు తినేందుకు , వాటికి ఎవరూ అడ్డు చెప్పకుండా ఉండేవిధంగా ఇటువంటి దొంగ సర్కులర్లను తీసుకువస్తున్నారని విమర్శించారు. తక్షణమే ఈ విద్యా వ్యతిరేక సర్కులర్ రద్దు చేయాలని లేనియెడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని దీనికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి చిన్నబాబు, జె రవికుమార్ , సహాయ కార్యదర్శి శిరీష నాయకులు జగదీష్ ,మురళి తదితరులు పాల్గొన్నారు.

Related Articles
Back to top button
error: Content is protected !!