A2Z सभी खबर सभी जिले की

120కిలోల గంజాయితో 8మంది నిందితులు అరెస్టు

*- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

జనం న్యూస్ 25 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజాపులోవ వద్ద భోగాపురం పోలీసులు మరియు ఈగల్ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు విజయనగరం నుండి మూడు కార్లలో వస్తున్న 8మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 47 ప్యాకెట్లలోగల 120కిలోల గంజాయిని, తొమ్మిది సెల్ ఫోన్లును సీజ్ చేసినట్లుగా జూలై 24న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – జూలై 24న భోగాపురం పోలీసులకు వచ్చిన
ఖచ్చితమైన సమాచారంతో రాజాపులోవ జంక్షను వద్ద వాహన తనిఖీలు చేపట్టగా, విజయనగరం నుండి మూడు కార్లలో
వస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 47 ప్యాకెట్లులోగల 120కిలోల గంజాయి,
9 సెల్ ఫోన్లు, ఒడి 05 హెచ్ 8352 నంబరుగల ఆల్టో కారు, ఓఆర్ 15ఎం 7782 నంబరు గల సాంత్రో కారు, యుపి 24 బిఎల్ 0902 నంబరు గల షిఫ్ట్ కారును సీజ్ చేసామన్నారు. పట్టుబడిన నిందితుల్లో (ఎ-1) ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లా లంతావూర్ బ్లాక్ బల్లేల్ గ్రామానికి చెందిన కొర్రా కిరణ్ (21 సం.లు) (ఎ-2) ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లా లంతాపూర్ బ్లాక్ బల్లేల్ గ్రామానికి చెందిన మనోజ్ బిసాయ్ (20 సం.లు) (ఎ-3) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హాపూర్ జిల్లా లక్ష్మణపుర గ్రామానికి చెందిన బిజేంద్ర (46 సం.లు) (ఎ-4) ఢిల్లీకి చెందిన పాత సీంపూర్
ప్రాంతానికి చెందిన పాజిల్ (30 సం.లు) (ఎ-5) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బుదాన్ జిల్లా సక్రి జంగిల్ గ్రామానికి చెందిన ముఖ్తర్ అహ్మద్ (43 సం.లు) (ఎ-6) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బుదాన్ జిల్లా అహిర్వారా గ్రామానికి చెందిన రామ్మోహన్
(21 సం.లు) (ఎ-7) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాశగాని జిల్లా కుల్లి గ్రామానికి చెందిన సోను (34 సం.లు) (ఎ-8) ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాశగాని జిల్లా కుల్లి గ్రామానికి చెందిన శిల్పి (30 సం.లు)గా విచారణలో గుర్తించామన్నారు. నిందితులు గంజాయిని ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలకు రవాణ చేయాలనే ఉద్ధేశ్యంతో ఒడిస్సా రాష్ట్రంకు చెందిన గంజాయి వ్యాపారులతో
సంబధాలున్నాయన్నారు. (ఎ-9) అజిత దడక అలియాస్ ఒజి అలియాస్ మహేష్ దడక అనే నిందితుడు పరారయ్యారని, అతడిని త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిందితులకు
ఒడిస్సాలో గంజాయి వ్యాపారులతో ఉన్న పరిచయాలతో గంజాయిని ఒడిస్సాలో కొనుగోలు చేసి, ట్రెయిన్, కార్లలో ఢిల్లీ,
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలో గంజాయిని కార్లలో విజయనగరం మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారన్నారు. నిందితులపై కఠిన చర్యలు
తీసుకుంటామని, వీరిపై ఫైనాన్సియల్ ఇన్విస్టిగేషను, పిట్ ఎన్.డి.పి.ఎస్. చట్టం ప్రకారం దర్యాప్తు చేస్తామని, పిడి యాక్టు కూడా ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి, గంజాయిని సీజ్ చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన భోగాపురం సీఐ కే.దుర్గా ప్రసాద్, ఈగల్ సిఐ డా. టెంక కళ్యాణి, ఎస్ఐ పి.పాపారావు మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, భోగాపురం సిఐ కే.దుర్గా ప్రసాద్, ఈగల్ సిఐ టి.కళ్యాణీ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Check Also
Close
Back to top button
error: Content is protected !!