A2Z सभी खबर सभी जिले की

*శక్తి యాప్ పట్ల ప్రతీ విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి*

*- విజయనగరం మహిళా పీఎస్ డీఎస్పీ ఆర్.గోవిందరావు*

విజయనగరం పట్టణం కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్ మహిళ పోలీసులు, వన్ స్టాప్ సెంటర్ అధికారులు విద్యార్థులకు శక్తి యాప్ పట్ల అవగాహన సదస్సు జూలై 24న నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ – విద్యార్ధులు మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని, లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థి దశలో చదువుపై దృష్టి పెట్టాలని, సోషల్ మీడియా ప్రభావానికి గురి కావద్దన్నారు. ప్రతీ విద్యార్థి శక్తి యాప్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆపద సమయంలో శక్తి ఎస్.ఓ.ఎస్. కాల్ ను ఉపయోగించి పోలీసుల సహాయం ఏవిధంగా పొందవచ్చునో వివరించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణించవలసి వచ్చినపుడు యాప్ లోని సేఫ్ ట్రావెల్ ఆప్షన్ వినియోగించి సురక్షితంగా గమ్య స్థానం చేరుకోవచ్చునని డీఎస్పీ విద్యార్దులకు వివరించారు. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం శిక్షలు తప్పవని డీఎస్పీ ఆర్.గోవిందరావు హెచ్చరించారు.
ఈ అవగాహన కార్యక్రమం లో రక్షణ కల్పించే వివిధ చట్టాల పట్ల, శక్తి మొబైల్ యాప్ పట్ల విద్యార్ధులకు పోలీసు అధికారులు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై శిరీష, వన్ స్టాప్ అధికారులు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!