
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2025 – 2026 ఫస్ట్ క్వార్టర్ మేనేజింగ్ కమిటీ మీటింగ్ గురువారం ఉదయం కలెక్టరేట్ వద్దనున్న నెహ్రు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యోగా కేంద్రంలో జరిగింది. మీటింగులో బ్లడ్ బ్యాంక్, జనఔషది మెడికల్ షాప్, ఐ డొనేషన్ సెంటర్ మరియు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలపై చర్చించి, అభివృద్ధి ఎలా చేపట్టాలో మాట్లాడు కోవడం జరిగింది.
అదే విధంగా 1వ త్రైమాసకంలో రాబడి ఖర్చులు వాటి వివరాలు సభ్యులకు తెలియజేయడమైనది. జన ఔషధీ మెడికల్ షాప్ అభివృద్ధి పలు సూచన చేయడం జరిగినది. రెడ్ క్రాస్ జిల్లా శాఖ అభివృద్ధికై కమిటీ సభ్యులు కృషి చేస్తామని ఈసందర్భంగా తెలియజేసారు. ఈసమావేశంలో జిల్లా చైర్మన్ కె.ఆర్.డి.ప్రసాదరావు,సెక్రటరీ కెంగువ సత్యం, కోశాధికారి టి.రామారావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు బి.వి. గోవిందరాజులు, కె.వెంకటరమణ, కే.బీ.వి.మురళి, డి.సూర్యరావు, డా. సి.హెచ్.పి. వేణుగోపాల్ రెడ్డి, మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.
కె. సత్యం,
కార్యదర్శి,
ఐ.ఆర్.సి.ఎస్., విజయనగరం.