
న్యూస్: కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమం లో భాగంగా సోమవారం అమరాయవలస చింతలవలస గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు గ్రామాల అభివృద్ధి తదితర కార్యక్రమాలపై వివరించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు గ్రామంలో కి ప్రవేశింపగానే ప్రతి వీధిలోను అపూర్వ ఆదరణతో స్వాగతం పలికారు. వెంకట్రావు ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రజల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజల కొరకు చేపట్టిన సంక్షేమ పథకాలు గ్రామాల లో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రజల సమస్యలను అవసరాలను తెలుసుకున్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పాలన సాగుతుందని గ్రామాల అభివృద్ధి చెందాలంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వ వలనే సాధ్యమని అని అన్నారు. ఈ కార్యక్రమంలో , అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గెద్ద అన్నవరం పిఎసిఎస్ కమిటీ సభ్యులు మణిపూరి రామచంద్రుడు కుంచు వెంకట్ టిడిపి సీనియర్ నేత కొరిపిల్లి చిన్నం నాయుడు యాసరపు రాము నాయుడు శరకాన రాము నాయుడు గుమ్మడి సింహాచలం పొన్నూరు రామలింగేశ్వర రావు గొర్లె సన్యాసి రావు పల్లె సింహాద్రి రెడ్డి గోవింద్ పూడి చందు నాయుడు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.