A2Z सभी खबर सभी जिले की

డోలీ మోతలతో గిరిజనులు ఇక్కట్లు

*ప్రభుత్వాలు మారినా మారని గిరిజనుల బ్రతుకులు*

ప్రభుత్వాలు ఎన్ని మారిన గిరిజనుల బ్రతుకులు మారడం లేదు అనడానికి ఇదే గొప్ప ఉదాహరణ. ప్రభుత్వాలు అభివృద్ధి పథకాలలో భాగంగా ప్రతి గ్రామానికి నీరు రహదారి విద్యా వైద్యం తదితర విషయాలపై దృష్టి సారిస్తూ ప్రజల మనలను పొందుతుంటారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన కూటమి ప్రభుత్వం లో కూడా గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు. ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక గిరిజన శాఖ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అనేక ప్రత్యేకమైన అభివృద్ధి పనులు చేపట్టడానికి అనేక నిధులు కేటాయించడం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఇంకా డోలిమోతలతో గిరిజనులు ఇబ్బందులు పడుతూ సాగిస్తున్న బ్రతుకులు చూడమని గిరిజనులు వేడుకుంటున్నారు. కొన్ని దినాల క్రితం పిట్టాడ పంచాయతీ మిర్తి వలస గిరిజన గ్రామానికి చెందిన సార అప్పారావు కు ప్రమాదం జరగడంతో కాలులో రాడ్లు ఉంచడం జరిగింది. వాటిని తీయించడానికి ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నంలో రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో డోలీలో తీసికొని వెళ్ళవలసి వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ డోలు మోత అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రోడ్లు ఇంకా అధ్వానంగా ఉండేవని, కూటమి ప్రభుత్వం దయదలసి గ్రావెల్ రోడ్లు నిర్మించినప్పటికీ వర్షాల కారణంగా రోడ్లు పాడైపోయాయని నడవడానికి కూడా వీలు లేకుండా తయారైందని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు స్పందిస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి పనుల ద్వారా రోడ్లను బాగు చేయడం జరిగిందని గిరిజనులకు ఇది పెద్ద సమస్యగా మారిందని ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా మూడు కిలోమీటర్లు తారు రోడ్డు మంజూరు అయిందని త్వరలోనే రోడ్ నిర్మాణం కూడా జరుగుతుందని తెలిపారు.

Back to top button
error: Content is protected !!