
జిల్లా పోలీసుశాఖలో క్రియాశీలకమైన స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది
తో జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు జూలై 5న జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశమై, వారు క్షేత్ర
స్ధాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశా నిర్ధేశం చేసారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు మాట్లాడుతూ – శాంతిభద్రతల పరిరక్షణలో
స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పనితీరు చాలా క్రియాశీలకమన్నారు. కావున, ఎస్బి సిబ్బంది క్షేత్ర స్థాయిలో ముందస్తు
సమాచారంను సేకరించేందుకు సమాచార వ్యవస్థను మెరుగుపర్చుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అసాంఘిక
కార్యకలాపాలు, రాజకీయ వివాదాలు, కక్షలు, భూతగాదాలు, గ్రూపుల గురించి సమాచారం ముందస్తుగా సేకరించా
లన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటిని ముందుగా గుర్తించి,
సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించాలన్నారు. తద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. సాంకేతికతను వినియోగించుకొని ప్రతీ అంశం పట్ల విషయ పరిజ్ఞానంను మెరుగుపర్చు
కొనేందుకు స్పెషల్ బ్రాంచ్ పోలీసు సిబ్బంది కృషి చెయ్యాలన్నారు. ప్రజలతో నిత్యం మమేకమవుతూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయం పని చేయాలని ఎస్పీ సిబ్బందికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు.
ఈ సమావేశంలో ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్ఐ సత్యన్నారాయణ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.