
మెంటాడ, న్యూస్: ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో ఎంతవరకు సంతృప్తికరం కలిగి ఉన్నారో తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనకు తొలి అడుగు 4.1 కార్యక్రమం శనివారం మెంటాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం వైద్యం పింఛన్లు రేషన్ తదితర విషయాలపై ప్రజలతో మాట్లాడారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టి న పథకాల అమలు తీరును, గ్రామాల్లో కలిగిన అనేక మార్పుల విధానమును క్షుణంగా పరిశీలించి ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని గమనించారు. ఆమె ఇంటింటికి వెళ్లి ప్రభుత్వపై ఉన్న విశ్వాసమును ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి పనుల పైనను వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. మండలంలో గల కూరగాయల షాప్లు వద్దకు ఇస్త్రీ బడ్డీ వద్దను చిన్న చిన్న వ్యాపారుల వద్దకు వెళ్లి వారికి ఎదురవుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ వృత్తుల పై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న వారికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని ఈ కార్యక్రమంలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి స్వరతగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తమ దృష్టికి వచ్చిన వివిధ గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చిస్తారని తెలిపారు. ఇంటింటికి వెళ్తున్న తరుణంలో ప్రజలు చూపిస్తున్న ఆదరణను బట్టి ప్రభుత్వం పై ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతుందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు, గెద్ద అన్నవరం, గొర్లె ముసలి నాయుడు, రాయిపిల్లి రవి, రాయి పిల్లి గౌరు శంకర్, ఎంపిటిసి రెడ్డి ఎర్రినాయుడు, రెడ్డి ఆదినారాయణ, రెడ్డి రాజగోపాల్ తాడ్డి తిరుపతి సిరిపురం గురు నాయుడు కొరిపిల్లి అప్పలరాజు టిడిపి కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.