A2Z सभी खबर सभी जिले की

*||పోక్సో కేసుల్లో నిందితులకు విధించే శిక్షలు గుణపాఠం కావాలి||*

*- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్*

పోక్సో కేసుల్లో విధించే శిక్షలు మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు గుణపాఠం కావాలని, మైనర్లుపై ఎవరైనా అఘాయిత్యాలకు
పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సెప్టెంబరు 26న హెచ్చరించారు. విజయనగరం
జిల్లా మహిళా పోలీసు స్టేషనులో 2024 సం. నవంబరు మాసంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం
పట్టణం జమ్ము నారాయణపట్నంలో నివాసం ఉంటున్న తరిని అప్పారావు (54 సం.లు)కు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కే. నాగమణి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000/-లు జరిమానా
విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ. 3 లక్షలను మంజూరు చేస్తూ సెప్టెంబరు 26న తీర్పు వెల్లడించారని
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం మండలం జమ్ము నారాయణపట్నంలోని ఒక అపార్టుమెంటులో నివాసం
ఉంటున్న నిందితుడు తరిని అప్పారావు (54 సం.లు) అనే నిందితుడు అదే అపార్టుమెంటులో నివాసం ఉంటున్న
మైనరు బాలిక (7 సం.లు)ను తే. 13-11-2024 దిన వారింటిలోకి తీసుకొని వెళ్ళి, లైంగిక దాడికి పాల్పడినట్లుగా
మైనరు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై మహిళా పోలీసు స్టేషను ఎస్ఐ ఎన్.పద్మావతి తే. 17-11-2024 దిన పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసారన్నారు. అనంతరం, అప్పటి డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టి,
నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసులో
ప్రాసిక్యూషను కేవలం పది మాసాల్లో పూర్తయ్యే విధంగా మహిళా పిఎన్ డిఎస్పీ ఆర్. గోవిందరావు, ఇన్సెపెక్టరు
ఈ.నర్సింహమూర్తి చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

నిందితుడు తరిని అప్పారావు (54 సం.లు)పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి నిందితుడికి 20సం.లు కఠిన కారాగార శిక్ష మరియు రూ. 5,000/-ల జరిమాన విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ. 3 లక్షలను మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించారన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్థవంతంగా పని చేసిన డిఎస్పీ ఆర్.గోవిందరావు, సి.ఎం.ఎస్. హెచ్సి సిహెచ్. రామకృష్ణ, కోర్టు కానిస్టేబులు జి.సూరపు నాయుడు, స్పెషల్ పీపీ జి.సత్యం లను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!