A2Z सभी खबर सभी जिले की

కార్పొరేట్ల సేవలో ప్రభుత్వ షైనింగ్ అవార్డ్స్ – SFI

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి కానీ ప్రైవేటు సేవలో తరించడం కాదు - SFI

 

సైనింగ్ స్టార్ అవార్డుల ఎంపిక లో ప్రభుత్వం అవలంబించిన విధానాలను ఉద్దేశించి భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేష్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు సైనింగ్ స్టార్ అవార్డు పేరుతో 20వేల రూపాయలు నగదు, సర్టిఫికెట్, అవార్డుతో సత్కరించింది. ఈ రోజు ప్రజాప్రతినిధులు చేతులు మీదుగా ఎంపిక కాబడిన వారికి అందించారు. దీనికి గాను ప్రతి మండలం నుంచి ఓసి కి ఇద్దరు, బీసీకి ఇద్దరు, ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరు ఎంపిక చేసి మండలానికి ఆరుగురుకి చొప్పున అవార్డులను ఇవ్వనుంది. ఈ అవార్డులకు ఎంపికైన ఇంటర్మీడియట్ విద్యార్థులలో 29 మందిప్రైవేట్ విద్యాసంస్థల నుంచి ఉంటే 17 మంది మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి ఎంపిక చేయబడ్డారు. పాఠశాలలకు సంబంధించి. మొత్తం 158 మందిలో 65 మంది ప్రైవేట్ పాఠశాలల నుండే ఎంపిక చేయబడ్డారు. ఈ రకమైనటువంటి అవార్డులు ప్రైవేటు, కార్పోరేట్, ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఒకే ప్రమాణాలు పాటించడం వలన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు నష్టపోయి ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా , సిలబస్ పూర్తిగా అవ్వకుండా , అరకొర సౌకర్యాల మధ్య చదువు సాగించి అత్యధిక మార్కులు పొందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ఈ షైనింగ్ అవార్డ్స్ ఇవ్వకపోవడం వారి కష్టాన్ని విస్మరించడమే. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ప్రతి మండలంలో ఓసి ఇద్దరు, బిసి ఇద్దరు, ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరు కి చొప్పున ఎంపిక చేయాలి. కానీ విజయనగరం జిల్లాలో ఈ ఎంపీ క విషయంలో కొంత జాప్యం జరిగింది. 580 మార్కులు వచ్చిన ఓసి క్యాటగిరి కలిగిన ప్రైవేటు పాఠశాల విద్యార్థికి ఎంపిక చేసి అదే 580 మార్కులు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నప్పటికీ వెనుకబడిన తరగతుల విద్యార్థి ఎంపిక చేయకపోవడం సామాజిక బాధ్యతను విస్మరించడం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ అవార్డులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది.

Related Articles
Back to top button
error: Content is protected !!