
ఏపీపీటీడీ ఎంప్లాయిస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా శనివారం
విజయనగరం డిపో వద్ద రెండవ రోజు ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి. రవి కాంత్. మాట్లాడుతూ 3వేల మంది ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన అంశాన్ని పరిశీలించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆశీస్సులు కారుణ్య నియామకం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీం అమలు చేసేలోపు కొత్త బస్సులు కొనుగోలు చేయడం డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఆప్కాస్ చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేర భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు ఎన్ స్వామి, డిపో కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి టీవీ రమణ జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తదితరులు పాల్గొన్నారు.