A2Z सभी खबर सभी जिले की

*జే సి ఐ జోన్-4 ఆధ్వర్యంలో ఆగస్టు 22న ప్రతిభకు పట్టాభిషేకం (JCSAT-2025)*

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ద్వారా జెసిఐ స్కాలర్షిప్ అండ్ ఆప్టిట్యూడ్ టాలెంట్ టెస్ట్ (JCSAT-2025).
జోన్ ఫోర్ ఇచ్చాపురం నుంచి కాకినాడ వరకి ఆగస్టు 22న కండక్ట్ చేయడం జరుగుతుందని *జోన్-4 జెసి సెట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు* ఒక ప్రకటనలో తెలిపారు.
6,7,8 తరగతిలో లెవెల్ వన్ 9,10 తరగతి లెవల్ టు ఇంటర్మీడియట్ ఫస్టియర్ సెకండియర్ (ప్లస్ వన్ ప్లస్ టు) లెవల్-3 గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి లెవెల్ లో కూడాను మొదటి బహుమతి గెలుచుకున్న వాళ్ళకి ఒక లక్ష వెయ్యి రూపాయలు Rs 100100/- ఇవ్వడం జరుగుతుంది అలాగే రన్నరపుగా సెకండ్ వచ్చిన వాళ్ళకి 51000/- బహుమతి ఇవ్వడం జరుగుతుంది.అంతేకాకుండా జోన్ లెవెల్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మెడల్స్ తో సత్కరించడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక స్కూలు లేదా కాలేజ్ నుంచి 100 కంటే ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేస్తే ఆ స్కూలు కాలేజీ లెవెల్ లో కూడా టాప్ త్రీ ని ఐడెంటిఫై చేసి వాళ్లకి రివార్డులు ఇవ్వడం జరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు.ఇటువంటి టాలెంట్ టెస్ట్ల విద్యార్థులు పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభను నిరూపించుకోవడం ద్వారా
భవిష్యత్తులో ఆత్మస్థైర్యం పెరిగి మరిన్ని బహుమతులు గెలుచుకోవడంతోపాటు మరిన్ని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునే అవకాశం ఉంటుందని *జోన్-4 అధ్యక్షులు సంతోష్ కుమార్ గారు* తెలిపారు.అంతేకాకుండా స్కూలు కాలేజీ యాజమాన్యం ఎవరైతే విద్యార్థులు ప్రోత్సహించి ఇట్లాంటి టాలెంట్ టెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి జెసి తరఫునుంచి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్తామని *JCI జాతీయ అధ్యక్షులు అంకుర్ జుంజున్ వాళ్* తెలిపారు.ఈ టాలెంట్ టెస్ట్ కి ఎగ్జామ్ అప్లై చేయడానికి ఈనెల 20వ తారీకు ఆఖరి తేదీ అని
*జూనియర్ జెసి డైరెక్టర్ కార్తీక్ గారు* ఈ ప్రకటనలో తెలిపారు.
ఇచ్చాపురం నుంచి కాకినాడ వరకి జోన్-4 లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని *జోన్-4 మెంటర్ కెవి రావు గారు* తెలిపారు.
మరిన్ని వివరాలకు జెసి సెట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ వెంకటేశ్వరావు గారిని 8985645952 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి

Back to top button
error: Content is protected !!