
కాకినాడలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా సంతకవిటి (M) శ్రీహరి నాయుడుపేటకు చెందిన జి.సాయి కిరణ్ (19) మంగళవారం 1600 మీటర్ల పరుగులో పాల్గొంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సర్పవరం సీఐ పెద్దిరాజు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.