A2Z सभी खबर सभी जिले की

అవయవ దాతల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా శివాజీ

 

అఖిలభారత అవయవదాతల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా షిణగం శివాజీని నియమించినట్లు అఖిలభారత అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలు,సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్(స్పెక్ట్) చైర్మన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి తెలిపారు.ఈ మేరకు నియామక ఉత్తర్వులను శివాజీకి ఈనెల 29న సింహాచలం గోశాల వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో అందజేశారు.ఈ సందర్భంగా సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ విజయనగరం జిల్లాకు చెందిన శివాజీ జనవిజ్ఞాన వేదిక ద్వారా సైన్స్ ప్రచార ఉద్యమం మరియు అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు.శివాజీ మాట్లాడుతూ అఖిలభారత అవయవదాతల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తనకి అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నెరవేరుస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్.ఎస్.వి రమణ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ బాలు పాల్గొన్నారు.

Related Articles
Show More
Back to top button