
ఈ రెండూ గాక ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి ఆయన పుట్టినరోజును వేడుకగా జరుపుకుంటున్నారా..
అన్నట్టు సాగిన ఓ ఉత్సవం..సమాచార శాఖలో ఆడియో..వీడియో సూపర్ వైజర్ గా సుదీర్ఘ కాలం పనిచేసి ఈరోజు పదవీవిరమణ చేసిన దామెర సత్యనారాయణ రిటైర్మెంట్ ఫంక్షన్ స్థానికంగా ఒక హోటల్లో ఘనంగా జరిగింది.ఒక ఇంటి పండగలా జరిగిన ఈ కార్యక్రమంలో సమాచార..పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారులు..రిటైర్డ్ అధికారులు..ఇతర ఉద్యోగులు..సత్యనారాయణ మిత్రులతో పాటు విజయనగరం జిల్లా కేంద్రంలోని పత్రికా మిత్రులందరూ పాల్గొని సత్యనారాయణపై తమ అభిమానాన్ని ఘనంగా చాటారు..సమావేశానికి బూరాడ శ్రీనివాసరావు నిర్వాహకుడిగా వ్యవహరించి ఆద్యంతం కార్యక్రమాన్ని చక్కగా నడిపారు.సమాచార శాఖ
పూర్వ ఉన్నతాధికారి అప్పారావు..పార్వతీపురం అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్..
విజయనగరం అసిస్టెంట్ డైరెక్టర్ మల్లేశ్వరరావు..డివిజనల్ పీఆర్ఓ జానకమ్మ వేదికపై
ఆసీనులై సత్యనారాయణ
సమాచార శాఖకు చేసిన సేవలను కొనియాడారు.
రొంగలి పోతన్న..రెడ్డి..
శ్రీకాకుళం డీపీఆర్వో గోవిందరాజులు..విశాఖ
నుంచి నారాయణరావు తదితరులు మాట్లాడారు.నూట రెండు సంవత్సరాల ఆయన మాతృమూర్తి హాజరు కావడం వేడుకకు నిండుదనాన్ని తెచ్చింది..
జీవిత భాగస్వామితో కలిపి సత్యనారాయణను అందరూ సత్కరించారు.
ఉన్నత స్థానాల్లో ఉన్న ఆయన కుమార్తె..కుమారుడు
వేడుకల్లో పాల్గొని తమ తండ్రి
విధినిర్వహణలో తలమునకలై
తమతో గడిపేందుకు కాలాన్ని ఎక్కువగా వెచ్చించలేకపోయినా తండ్రిగా తమ ఉన్నతికి తన శ్రమనంతా ధారపోసారని తండ్రి పట్ల తమ ప్రేమను..గొరవాన్ని చాటుకున్నారు.