
వివాహం చేసుకోమని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో అయ్యకోనేరు గట్టు చెరువులో పడి యువతి ఆత్మహత్య చేసుకుంది. టౌన్ ఎస్‌ఐ కనకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బెహరా రమ్య ( పద్దెనిమిది సంవత్సరాలు ) డిగ్రీ చదువుతోంది. వివాహం చేస్తామని ఆమెకు చెప్పగా ముందు తన అన్నయ్యకు చేయమంది. వినకుండా బలవంతం చేయడంతో శుక్రవారం రాత్రి ఇళ్లు వదిలి వెళ్లిందన్నారు. ఈరోజు చెరువులో మృతదేహం తేలడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

