A2Z सभी खबर सभी जिले की

వయోధిక పాత్రికేయుడు, ఎపియుడబ్ల్యూజే మాజీ జిల్లా అధ్యక్షుడు బొర్రా కన్నుమూత

వయోధిక పాత్రికేయుడు, ఎపియుడబ్ల్యూజే మాజీ జిల్లా అధ్యక్షుడు బొర్రా సత్యనారాయణ (80) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో ఇక్కడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న సత్యనారాయణ రాత్రి పదిన్నర గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
గతంలో ఆంధ్రభూమి పత్రికకు సుదీర్ఘకాలం గజపతినగరం విలేకరిగా ఆయన పనిచేశారు. అంతేగాక ఉమ్మడి విజయనగరం జిల్లా ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షునిగా కూడా సేవలందించారు.
ఆయన కుమారుడు నరసింగ రావు, అల్లుడు భక్తి సమాచారం నాగరాజు కూడా పాత్రికేయ రంగంలో సుపరిచితులు. సీనియర్ పాత్రికేయుడు సత్యనారాయణ మృతి పట్ల సంఘ నాయకులు దిమిలి అచ్యుతరావు, శివప్రసాద్, రాజు, పంచాది అప్పారావు మహాపాత్రో, శర్మ తదితరులతో పాటు పలువురు జర్నలిస్టులు తమ సంతాపం తెలిపారు.

Show More
Back to top button
error: Content is protected !!