

కొత్త ఉత్సాహం, ఆశయాల మధ్య భీమిలి నియోజకవర్గం ఆనందపురం పార్టీ కార్యాలయం నూతన సంవత్సర వేడుకలకు వేదికైంది. గురువారం ఉదయం నుండే కార్యాలయ ప్రాంగణం ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలంతో కిక్కిరిసిపోయింది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైఎస్ఆర్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.
ఈ వేడుకలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు. జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు తరలివచ్చి చిన్న శ్రీనుకు, వారి కుమార్తె సిరమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ పరిధిలో పార్టీ ఎస్ ఈ సీ మెంబర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మండల మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కార్పొరేటర్లు, జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, మహిళా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు, స్థానిక ముఖ్య నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, వేలాది మంది ప్రజలు పాల్గొని తమ నాయకునికి శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ కార్యాలయం ఆవరణ అంతా పండుగ వాతావరణం నెలకొనగా, వచ్చిన వారందరికీ చిన్న శ్రీను, సిరమ్మ స్వయంగా అభివాదం చేస్తూ నూతన సంవత్సర ఆకాంక్షలు తెలియజేశారు.