
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి *కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక సేవ, రాజకీయ అంశాలలో చురుకుగా ఉండే *సిరమ్మ* గారు, సమాజానికి నిరంతరం వార్తలు అందించే క్రమంలో నిజాయితీగా వృత్తినే దైవంగా భావించి, తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కష్టపడే మీడియా మిత్రుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా, ఆమె ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీడియా సోదరులకు అండగా నిలుస్తూ, వారి ఆరోగ్య సంరక్షణ కోసం ముందుచూపుతో ఒక గొప్ప ఆలోచన చేశారు. ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి హెల్త్ ఇన్సూరెన్స్ నిమిత్తం ఆమె ప్రత్యేకంగా నగదు బహుమతిని అందించారు. మీడియా సోదరుల ఆరోగ్యం పట్ల *సిరమ్మ* గారు చూపిన ఈ ఆప్యాయత మరియు గొప్ప మనసు పలువురి ప్రశంసలు అందుకుంది.