
మహిళల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని
డాక్టర్ లోకప్రియ అన్నారు. శుక్రవారం మెంటాడ మండలం లో జి.టి.పేటగ్రామంలో స్వస్థనారీ స్వసక్తి పరివార్ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి ఎల్.ముత్యాలునాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లోకప్రియ మాట్లాడుతూ ఈ శిబిరంలో వచ్చిన మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి గుర్తించిన వ్యాధులకు సంబంధించిన మందులు అందజేయడం జరిగింది. రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సరు గర్భాశయ క్యాన్సరు స్కానింగ్ పోషణ అభియాన్ ఈట్ రైట్ సదుపాయాలు తల్లి బిడ్డ సేవలు వయోవృద్ధులుఆరోగ్య పరిక్షలు క్షయవ్యాధి స్కానింగ్ మానసిక వైద్య సేవలు ఆయూష్ వైద్య సదుపాయాలు వంటివి వివిధ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించామన్నారు. అవసరమైన వారికి తగిన వైద్య సేవలందించేందుకు సిఫారసు చేశామన్నారు. బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ సత్యనారాయణ మాజీ ఉప సర్పంచ్ టిడిపి పార్టీ నాయకులు చొక్కాకు సన్యాసి నాయుడు ఏఎన్ఎం పార్వతి ఎం.ఎల్.హెచ్.పి ఫీల్డ్ అసిస్టెంట్ ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు హెల్త్ అసిస్టెంట్ ఆసుపత్రి సిబ్బంది గ్రామ ప్రజలు మహిళలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
