A2Z सभी खबर सभी जिले की

అంతా తానై.. జిల్లా పోలీసుశాఖను నడిపించిన ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్

జిల్లా ఎస్పీగా పని చేసి, గుంటూరు జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా ప్రత్యేక కథనం.

వకుల్ జిందల్, ఐపిఎస్ జిల్లా ఎస్పీగా జిల్లా పోలీసు కార్యాలయంలో జూలై 17న బాధ్యతలు స్వీకరించి, సంవత్సర కాలం విజయనగరం పూర్తి చేసుకొని, పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేసి, గంజాయిపై ఉక్కుపాదం మోప్, అసాంఘిక కార్యకలాపాలను అణిచి వేయడంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. జిల్లా పోలీసుశాఖలో శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి నియంత్రణ, మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడంలో కృతకుత్యులయ్యారు.

‘సంకల్పం’కు శ్రీకారం:

జిల్లాలో యువత వ్యసనాలకు అలవాటుపడి, చెదు మార్గం పడుతున్నారని, వారిని సక్రమ మార్గంలో నడిపించాలని ‘సంకల్పం’ కార్యక్రమాన్ని చేపట్టారు. గంజాయి, మద్యం, ఇతర మత్తు, మాదక ద్రవ్యాలకు యువత అలవాటుపడి తమ జీవితాలను ఏవిధంగా నాశనం చేసుకుంటున్నారన్న విషయాన్ని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వీడియోలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషను ద్వారా వివరించి, వారిని ఆలోచింపజేసారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించేందుకు కళాశాలలు, పబ్లిక్ స్థలాల్లో 210 డ్రాప్ బాక్సులను, కళాశాలల్లోవిద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసుల తో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేకంగా ఏంటి డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా 772 స్కూల్స్, కాలేజ్లో నిర్వహించి, 67,164 మంది స్టూడెంట్స్కు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమ ప్రచారంలో భాగంగా 45,162 కర పత్రాలను విద్యార్థులకు అందజేయగా, 132 హెర్డింగులను జిల్లా వ్యాప్తంగా. ఏర్పాటు చేసారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో 2,509 సంకల్పం కార్యక్రమాలను చేపట్టి, 1,83,157 మందికి అవగాహన కల్పించారు.

Related Articles

‘సంకల్ప రధం’ విస్తృత ప్రచారం:

మాదక ద్రవ్యాల అలవాట్లు గ్రామ స్థాయిలో ఉన్నాయని గుర్తించి, గ్రామాల్లో ప్రజలకు ‘సంకల్ప రధం’ తో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, వారిని చైతన్యవంతులు చేసారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారికి పోలీసు సేవలు అందించుటలో కృతకృత్యులయ్యారు. ప్రజలకు రహదారి భద్రత, మహిళల భద్రత, సైబరు భద్రత పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టి, వారికి అవసరమయ్యే రక్షణ చట్టాలు వట్ల అవగాహన కల్పించారు. ఒక వైపు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మరోవైపు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టారు. సంకల్ప రధంతో 322 గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించి, క్షేత్ర స్థాయిలో 26,082 మందికి మత్తు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వలన కలిగే అనర్ధాల పట్ల అవగాహన కల్పించారు. అదే విధంగా సంకల్ప రధంతో 184 స్కూల్స్ను సందర్శించి, 34,040మంది స్టూడెంట్స్కు మాదక ద్రవ్యాల అనర్ధాల పట్ల అవగాహన కల్పించారు.

గంజాయిపై ఉక్కుపాదం:

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తరువాత గంజాయి అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపారు. గంజాయి అక్రమ రవాణకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తూనే, అందుకు బాధ్యులైన వ్యాపారులు, దళారులు, వ్యక్తులపైనా కఠిన చర్యలు చేపట్టి, వారిని కూడా కేసుల్లో నిందితులుగా చేర్చి, గంజాయి వ్యాపారులను కట్టడి చేసారు. గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టాలనే లక్ష్యంగా ప్రత్యేకంగా ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, నిరంతరం తనిఖీలు చేపట్టారు. ప్రతీ రోజు 10 ప్రాంతాల్లో ఆకస్మికంగా డైనమిక్ వాహన తనిఖీలు చేపట్టి, ఇతర రాష్ట్రాల నుండి మన జిల్లా మీదుగా గంజాయి అక్రమ రవాణను కట్టడి చేసారు. గంజాయి సాగు చేసినా, పెద్ద మొత్తాల్లో విక్రయించినా, మధ్యవర్తిత్వం వహించినా, అక్రమ రవాణకు పాల్పడినా, వినియోగించినా, పెడ్లర్స్ గా వ్యవహరించినా కఠిన చర్యలు చేపట్టడం గంజాయి అక్రమ రవాణ నియంత్రణలో సత్ఫలితాలిచ్చాయి. గంజాయి వ్యాపారాలు సాగించి, అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను గుర్తించి, వాటిని అటాచ్ చేసి, వారిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తరువాత గంజాయి అక్రమ రవాణదారులపై 124 కేసులు నమోదు చేసి, 2292.22 కిలోల గంజాయి, 48 వాహనా లను సీజ్ చేసి, 407 మంది నిందితులను అరెస్టు చేసామన్నారు. గంజాయి వ్యాపారాలతో ఆస్తులను కూడబెట్టిన ముగ్గురు నిందితులకు సంబంధించిన సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి, అటాచ్ చేసామన్నారు. అదే విధంగా రాజాం మండలం గురువాం గ్రామానికి చెందిన కుప్పిలి నవీన్ అనే వ్యక్తిపై పలు కేసులు ఉండడంతో అతడిపై పి.డి. యాక్టు ప్రయోగించారు. గంజాయి కేసుల్లో 18 గ్యాంగులకు చెందిన 92 మందిని గ్యాంగు ఫైల్సు ప్రారంభించి, వారిపై నిఘా పెట్టామన్నారు.

పోక్సో ట్రయల్ కేసుల్లో నిందితులు శిక్షించబడే విధంగా ప్రత్యేక చర్యలు:

మైనరు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి, కోర్టులో ట్రయల్లో ఉన్న కేసులు త్వరితగతిన విచారణ జరిగే విధంగా చర్యలు చేపట్టడంతో 13 మాసాల వ్యవధిలో 28 పోక్సో కేసుల్లో నిందితులు కఠినంగా శిక్షించడ్డారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గారు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, చొరవ కారణంగా 25 సం.లుకు పైబడి మూడు కేసుల్లోను, 20సం.లకు పైబడి 12 కేసుల్లో నిందితులకు ప్రత్యేక పోక్సో న్యాయస్థానం కఠిన కారాగార శిక్షలు విధించింది. పోక్సో కేసులు నమోదైన ఆరు మాసాల్లోనే ఆరు కేసుల్లోనే నిందితులకు శిక్షపడే విధంగా ప్రాసిక్యూ షను పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

పోగొట్టుకున్న మొబైల్స్ ను ట్రాక్ చేసేందుకు ప్రత్యేక చర్యలు:

మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు పోలీసు స్టేషనుల చుట్టూ తిరగకుండా 8977945606 కు మెసేజ్ పంపినట్ల యితే ఒక గూగుల్ ఫారం పంపి, వివరాలను పూర్తి చేసినట్లయితే, వారి మొబైల్ను ట్రాక్ చేసేందుకు చర్యలను చేపడుతూ, పోగొట్టుకున్న మొబైల్స్ను బాధితులకు తిరిగి అప్పగిస్తున్నారు. 564 మొబైల్ ఫోన్లును జిల్లా ఎస్పీగారు బాధితులకు అప్పగించారు.

రహదారి ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిః

రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు జాతీయ, రాష్ట్ర రహదారులపై గుర్తించిన బ్లాక్ స్పాట్స్ న్స్ను స్వయం గా సందర్శించి, ప్రమాదాలకు కారణాలను అన్వేషించి, అవసరమైన మార్పులను సంబంధిత అధికారుల సహకారంతో చర్యలు చేపట్టారు. బ్లాక్ స్పాట్స్కు ఇరువైపులా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం, అవసరమైన ప్రాంతాల్లో లైటింగును ఏర్పాటు చేయడం, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లును ఏర్పాటు చేయడం, రేడియం స్టిక్కర్లు, స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేసి, ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టారు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టం’:

ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ తో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారులతో ఫోను/ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, సమస్యను వివరించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదిదారులకు న్యాయం చేయాలని ఆదేశిస్తున్నారు.

‘పల్లె నిద్ర’కు శ్రీకారం:

ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొనేందుకు పోలీసు అధికారులు, దత్తత గ్రామాల పోలీసు సిబ్బంది గ్రామస్థులతో సమావేశమై, పల్లెల్లో బస చేసే విధంగా చర్యలు చేపట్టారు. బస చేసే సమయంలో గ్రామస్థులతో మమేకమై, క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతల సమస్యలు, గ్రామంలో విభేదాలు గురించి తెలుసుకొని, పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. 266 మంది పోలీసు అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

డ్రోన్స్ వినియోగంతో నేర నియంత్రణలో పటిష్టమైన చర్యలు:

నేర నియంత్రణలో జిల్లా వ్యాప్తంగా డ్రోన్స్ను వినియోగిస్తూ, సత్ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ఇందులో భాగం గా కోడి పందాలు, పేకాటలు, ఓపెన్ డ్రింకింగు చేసే వారిపై డ్రోన్స్తో నిఘా పెట్టి, వారిని అరెస్టు చేస్తున్నామన్నారు.ఇప్పటి వరకు పేకాట ఆడుతున్న వారిపై 8 కేసులు, కోడి పందాలు ఆడుతున్న వారిపై రెండు కేసులు, ఓపెన్ డ్రింకింగు చేసిన వారిపై 85 కేసులు నమోదు చేసామన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలుః

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి 11గంటల తరువాత సహేతుకరమైన కారణం లేకుండా బయట తిరగవద్దని యువతకు కౌన్సిలింగు నిర్వహిస్తున్నారు. గస్తీ, పెట్రోలింగును మరింత పటిష్టంగా నిర్వహించేందుకు ఈ-సహారా వ్యవస్థను అమల్లోకి తీసుకొని వచ్చారు. ప్రజలు, దాతలు, ప్రభుత్వసహకారంతో జిల్లా వ్యాప్తంగా వాణిజ్య సముదాయాలు, ముఖ్య కూడళ్ళలోను, నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లోను 3000సిసి కెమెరాలను ఏర్పాటు చేసారు. అదే విధంగా ఆలయాలు, మసీదులు, చర్చిల్లో మరో 2,048 సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, నిఘా పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, స్కూల్స్, పాఠశాలల సమీపంలో 512 మంది వ్యాపారులపై కోస్టా కేసులు నమోదు చేసి, రూ.1,13,900/-లను కోస్టా చట్టం ప్రకారం జరిమానా విధించారు.

పోలీసు సంక్షేమానికి పెద్ద పీటః

పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించి పోలీసు సిబ్బందికి, వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. మహిళా పోలీసు సిబ్బందికి, పోలీసు కుటుంబాల మహిళలకు కేన్సర్ స్క్రీనింగు పరీక్షలు నిర్వహించారు. పోలీసు కుటుంబాలకు తక్కువ ఖరీదుకు కిరాణ, ఇతర వస్తువు లను విక్రయించేందుకు సబ్సిడరీ క్యాంటీన్ను ఏర్పాటు చేసారు. కార్పొరేట్ స్కూల్సు ధీటుగా నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఉత్తమ విద్యను పోలీసు స్కూలు ద్వారా పోలీసు, హోంగార్డుల పిల్లలకు అందిస్తున్నారు.

జిల్లా ఎస్పీగా ఇప్పటి వరకు సాధించిన ప్రగతిః

సైబరు నేరంను చేధించినందుకుగాను ఇటీవలే రాష్ట్ర డిజిపి గారి చేతుల మీదుగా ‘అవార్డు ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్ అవార్డు’, లోక్ అదాలత్లో ఎక్కువ కేసులను డిస్పోజ్ చేసినందుకు మరియు ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిర్వహించినందుకు గాను ఉన్నతాధికారులు, రాష్ట్ర ఎన్నికల కమీషనరు నుండి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రశంసలు పొందారు. అంతేకాకుండా, రెండు సార్లు రాష్ట్ర డిజిపి గారి నుండి గోల్డ్, సిల్వరు డిస్క్ అవార్డులు, సంకల్పం కార్యక్రమం చేపట్టినందుకు ప్రతిష్టాత్మకమైన ‘స్కాచ్’ అవార్డు సాధించి, విజయనగరం జిల్లా పేరును దేశ స్థాయిలో ఇనుమటింపజేసారు.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!