
*విశాఖపట్నం, సెప్టెంబర్ 12:* విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు, రేంజ్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, మరియు వివిధ నేరాల నిరోధక చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
గంజాయి నిర్మూలనలో కీలక చర్యలలో భాగంగా అక్రమ గంజాయి రవాణా వ్యాపారంలో పాల్గొన్న 14 మంది నేరస్తుల ఆస్తులు రూ.10,04,89,621/- విలువైనవి స్వాధీనం చేసుకోవడాన్ని డీఐజీ గారు అభినందించారు.
ఇప్పటివరకు 1119 మంది గంజాయి నేరస్తుల కదలికలపై షీట్లు తెరవడం, అలాగే 51 మంది నిందితులపై PD చట్టం, 80 మందిపై PIT NDPS చట్టం అమలు చేయడానికి ప్రతిపాదన.
తరచూ గంజాయి రవాణా చేసే 368 మంది నేరస్తులు, అలాగే గంజాయి తో పాటు ఇతర నేరాలలో పాల్గొన్న 370 మంది నేరస్తులను గుర్తించడం జరిగింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
న్యాయస్థానాలు
ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ల ఆధారంగా 341 మందిని పట్టుకొని కోర్టులో హాజరుపరచడం జరిగింది.
2025 సంవత్సరంలో ఇప్పటివరకు 20 కేసుల్లో 33 మంది నిందితులకు శిక్షలు విధించబడ్డాయి. వీరిలో 24 మందికి 10 నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయి.
విశాఖపట్నం రేంజ్ పోలీసులు టెక్నాలజీ వినియోగించి:
Stay Safe, Nidan, Koz, Nat Grid Apps ద్వారా పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంలో అధికారులు చూపిన కృషిని డీఐజీ గారు అభినందించారు.
భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా గంజాయి రవాణా మార్గాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రవాణా పూర్తిగా అరికట్టే వ్యూహం రూపొందించాలని సూచించారు.
స్త్రీలు, చిన్నపిల్లలపై లైంగిక నేరాలు, తప్పిపోయిన మహిళలు, బాలికల కేసులు పైన సమీక్ష చేసి వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.
SC/STs అత్యాచార నిరోధక చట్టం క్రింద నమోదైన కేసులను సమయపూర్వకంగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
రేంజ్ పరిధిలోని శాంతి భద్రతల సమస్యలపై లోతైన చర్చ జరిపి, భవిష్యత్తు కోసం తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
ఈ సమీక్ష సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్గర్, అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ మాధవరెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు.
*రేంజ్ పోలీస్ కార్యాలయం,* *విశాఖపట్నం.*
