
🌀 *7మాసాల వ్యవధిలోనే పోక్సో కేసులో నిందితుడికి శిక్షింపబడే విధంగా చర్యలు చేపట్టామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*
🌀 *నిందితుడికి రూ.2వేలు జరిమానా, బాధితురాలికి రూ.25,000/- ల పరిహారం మంజూరు చేసారన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*
విజయనగరం జిల్లా తెర్లాం పోలీస్ స్టేషనులో 2025 నం. ఫిబ్రవరి మాసంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు తెర్లాం మండలం బిసి కాలనీకి చెందిన కంకణాల కిరణ్ (36సం.లు) అనే వ్యక్తికి విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కె.నాగమణి గారు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2,000/- లు జరిమానా విధిస్తూ సెప్టెంబర్ 12న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన ఒక మైనరు బాలిక (12 సం.లు) నడుచుకుంటూ తన ఇంటికి వెళుతుండగా అదే గ్రామానికి చెందిన కంకణాల కిరణ్ (36 సం.లు) వెనుక నుండి వచ్చి బాలికను అడ్డగించి, అసభ్యంగా ప్రవర్తించగా, బాలిక పెద్దగా కేకలు వేయగా, దగ్గరలో వున్న కొంత మంది పెద్ద మనుషులు వచ్చేసరికి నిందితుడు అక్కడ నుండి పారిపోయాడన్నారు. సదరు బాలికను తన ఇంటి దగ్గరకు తీసుకొని
వెళ్ళి తల్లిదండ్రులకు అప్పగించగా, బాలిక తల్లి తెర్లాం పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా ఎస్ఐ బి.సాగర్ బాబు
నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. కేసు నమోదైన 7 నెలల కాలంలోనే ప్రాసిక్యూషను పూర్తయ్యే విధంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో తెర్లాం ఎస్ఐ బి.సాగర్ బాబు చర్యలు చేపట్టారన్నారు. న్యాయస్థానంలో నిందితుడు కంకణాల కిరణ్ (36సం.లు)పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి
గారు నిందితుడికి 3 సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.2,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.25,000/- ల మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసులు తరుపున పోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించగా, తెర్లాం ఎస్ఐ బి.సాగర్ బాబు ఆధ్వర్యంలో
తెర్లాం పోలీస్ స్టేషన్ కోర్ట్ హెచ్.సి. జి.జనార్ధన్ రావు, సి.ఎం.ఎస్. హెచ్.సి. సిహెచ్.రామకృష్ణ సాక్షులను బ్రీఫ్ చేసి,
సకాలంలో కోర్టులో హాజరు పర్చారన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టిన జుడిషియల్, పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.
*||జిల్లా పోలీసు కార్యాలయం,||*
*||విజయనగరం.||*
