
మహాత్ముడి మార్గాలే నా జీవిత గమ్యాలు
కోటబొమ్మాళి డెక్కన్ న్యూస్ : మహాత్ముడి మార్గాలే నా జీవత గమ్యాలని, నా చిన్నతనంలో మా తండ్రి రఘుపాత్రుని రంగనాధం 1940లో గాంధీ పిలుపు మేరకు ఉప్పుసత్యగ్రహంలో పాల్గొని జ్కెలుకు వెళ్ళారని గాంధీవాధి రఘుప్రాతుని వసంతకుమార్ అన్నారు. శుక్రవారం 79th స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఆయన స్థానిక పాతబస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా తండ్రి గాంధీ అభిమాని కావటంలో గాంధీ పిలునిచ్చిన ఉప్పుసత్యాగహంలో పాల్గొని జ్కెలుకు వెళ్ళారని, తరువాత ప్రభుత్వం గుర్తించి ఐదు ఎకరాల భూమిని కూడా మాకు ఇచ్చిందని వసంత్ తెలిపారు. గాంధీ ఆశయాలను నచ్చి ఆయన మార్గంలో పయనించాలని చిన్ననాడే అనుకున్నానని అప్పటి నుంచి తనకు తోసిన సహయం ప్రజలకు చేస్తున్నానని అయన తెలిపారు. ప్రతీ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్తే, గాంధీజయంతి రోజులలో విద్యార్థులకు గాంధీ గురించి వివరించి ఆయన మార్గంలో పయనించాలని చెబుతుంటానని ఆయన తెలిపారు. కోటబొమ్మాళి పంచాయతీ కార్యాలయంలో సుమారు 30 సంవత్సరాలు ప్రైవేటు ఉద్యోగిగా పని చేసి ప్రజలకు తనకు త్రోచిన సహాయం చేశానని, కోటబొమ్మాళి పంచాయతీలో వసంతకుమార్ అంటే తెలియనివారు లేరని అన్నారు. ప్రతి ఒక్కరు గాంధీ మార్గంలో పయనించి గాంధీ అశయాలను ముందుకు తీసుకు వెళ్ళాలని ఆయన కోరారు.