
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో శనివారం సాయంత్రం స్పా సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు విజయనగరం 1వ పట్టణ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి. ఆగష్టు 16న తెలిపారు.
పట్టణంలోని వివిధ స్పా సెంటర్లలో 1వ పట్టాణ సిఐ, ఎస్ఐలు ప్రసన్న కుమార్, రాం గణేష్, సురేందర్ నాయుడు మరియు సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు బయటపడలేదని, స్పా సెంటర్ల నిర్వాహకులకు తగిన సూచనలు ఇచ్చారన్నారు. స్పా సెంటర్లు కార్యకలాపాలను పూర్తి పారదర్శకంగా, చట్టబద్ధంగా కొనసాగించాలని సూచించారు. స్పా సెంటర్లకు సంబంధించి రికార్డులు, సిసిటివి ఫుటేజీలను పరిశీలించామన్నారు. స్పా సెంటర్లలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని, ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పా సెంటర్ల నిర్వాహకులను సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి హెచ్చరించారు.