A2Z सभी खबर सभी जिले की

మెంటాడ మండలంలో నాటు సారా స్థావరాలపై దాడి

మెంటాడమెం

టాడ మండలం కొండలింగాలవలస పంచాయతీ పరిధిలోని రెడ్డివాణివలసలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అక్రమ నాటు సారా తయారీపై గట్టి దాడి చేపట్టారు. గజపతినగరం సీఐ రమణ నేతృత్వంలో ప్రత్యేక బృందం నిర్వహించిన కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో నాటు సారా తయారీకి వాడే స్థావరాలను ధ్వంసం చేశారు.

దాడిలో వెయ్యి లీటర్ల ముడి సరుకు, ముప్పై లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, నాటు సారా తయారీ మట్టికల్లు, భాండాలను కూడా ధ్వంసం చేశారు.

అక్రమంగా నాటు సారా తయారుచేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆండ్ర ఎస్సైకె సీతారాం వెల్లడించారు.

Related Articles

అక్రమ మద్యపానాన్ని అరికట్టేందుకు ఇటువంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

Show More
Back to top button
error: Content is protected !!