
విజయనగరం, జూలై 28:
సహకార రంగం అభివృద్ధి చెందితేనే సామాజికాభివ్రుద్ధి తద్వారా దేశాభివృద్ధి సాధ్యమని సహకారభారతి రాష్ట్ర అధ్యక్షుడు అడ్డూరి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక రహదారి బంగళా వద్ద గల కలాం ఫౌండేషన్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహకార భారతి విజయనగరం జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.1957లో ఏర్పాటైన సహకార భారతి ద్వారా అనేక మంది సహకార రంగంలో తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు రాజకీయ రంగంలోనూ రాణించారని అన్నారు.
ఉత్తరాధి రాష్ట్రాల్లో సహకార రంగాన్ని అభివృద్ధి చేయడం వలననే ఆయా రాష్ట్రాలు రైతులకు,ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించగలగాయని తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్రలో చక్కెర కర్మాగారాలు,గుజరాత్ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి, వివిధ రంగాల్లో అభివృద్ధిని కనపర్చాయని,దురద్రుష్టవశాత్తు దక్షిణాధి రాష్ట్రాల్లో సహకార రంగాన్ని ప్రభుత్వాలు,ప్రజలు నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సహకారభారతి ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ జిల్లాల్లో కమిటీలు వేస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలలో సమన్వయకర్తలు మమ్ముల తిరుపతిరావు,అమరా సర్వదేవుళ్లు ఆధ్వర్యంలో మంచి నిబద్ధత కలిగిన కమిటీలు వేసామని రాష్ట్లంలోనే ఆదర్శవంతమైన సహకార సంఘాలుగా ఏర్పాటుకు క్రుషి చేస్తామని తెలిపారు.
జాతీయ కౌన్సిల్ సభ్యురాలు జానకీదేవి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నుండి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా సహకార భారతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు.మహిళా సంఘాలు ఏర్పాటు, మాక్స్ సొసైటీల రిజిస్ట్రేషన్,వాటి ద్వారా ప్రభుత్వ పధకాల లబ్ధిని వివరించారు.సభకు అద్యక్షత వహించిన ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ ఏపి అద్యక్షుడు మమ్ముల తిరుపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన పి4 కార్యక్రమంలో పాల్గొంటూ వైద్యం,ఆరోగ్యం,విద్య ,నాయకత్వ లక్షణాల అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని, అందులో భాగంగా రైతు సంఘాలు, ఉత్పత్తిదారుల సంఘాలు,మేక్స్ లు ఏర్పాటు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు సహకరిస్తామని తెలిపారు.
సభ ప్రారంభానికి ముందు మాజీ రాష్ట్రపతి,భారతరత్న డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలామ్ 10వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించారు.అనంతరం సామాజిక సేవా రంగం నుండి రాజకీయ రంగంలోకి వచ్చి కెల్ల పిఏసియస్ ఛైర్మన్ గా నియమితులైన టియన్డీయఫ్ అధ్యక్షురాలు కె.విమలారాణిని ఘనంగా సత్కరించారు.
“సహకారభారతి విజయనగరం జిల్లా నూతన కమిటీని ప్రకటించారు” ఈ కార్యక్రమంలో చేనేత విభాగం రాష్ట్ర ప్రముఖ్ రామక్రిష్ణ,జిల్లా అధ్యక్షుడు జాగరపు ఈశ్వర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మార్పిన అప్పలనాయుడు, సహ కార్యదర్శి త్యాడ రామకృష్ణారావు( బాలు) మహిళా ప్రముఖ్ పద్మలత,సహ ప్రముఖ్ కె ప్రవళ్లిక,సభ్యులు కొల్లి సత్యనారాయణ,ఆశపు లోకేష్,డ్వాక్రా ప్రముఖ్ దుక్క క్రిష్ణవేణి, శ్రీకాకుళం అద్యక్షుడు రౌతు సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
~త్యాడ రామకృష్ణారావు(బాలు)