A2Z सभी खबर सभी जिले की

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి తోనే సాధ్యం –మంత్రి గుమ్మడి సంధ్యారాణి

*హారతులతో స్వాగతించిన జక్కువ గ్రామస్తులు

మెంటాడ: న్యూస్ : కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమం లో భాగంగా జక్కువ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్యఅతిథిగా పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు గ్రామాల అభివృద్ధి తదితర కార్యక్రమాలపై వివరించారు. మంత్రి గ్రామంలో కి ప్రవేశింపగానే ప్రతి వీధిలోను అపూర్వ ఆదరణతో పాటు ప్రజలు హారతులతో ఘనస్వాగతం పలికారు. ఆమె ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రజల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజల కొరకు చేపట్టిన సంక్షేమ పథకాలు గ్రామాల లో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రజల సమస్యలను అవసరాలను తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై అవసరాలపై స్పందిస్తూ సాధ్యమైనంతవరకు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పాలన సాగుతుందని గ్రామాల అభివృద్ధి చెందాలంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వ వలనే సాధ్యమని అని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మెంటాడ మరియు జక్కువ పిఎసిఎస్ అధ్యక్షులు గొర్లె ముసలి నాయుడు మరియు జక్కువ పిఎసిఎస్ అధ్యక్షులు ఆర్నపిల్లి సత్యం సొసైటీ డైరెక్టర్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రమాణ శ్రీకారం చేయించడం జరిగింది. చైర్మన్ డైరెక్టర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు, అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గెద్ద అన్నవరం, మెంటాడ పిఎసిఎస్ అధ్యక్షులు గొర్లె ముసలి నాయుడు, జక్కువ పిఎసిఎస్ అధ్యక్షులు ఆర్నపిల్లి సత్యం సొసైటీ డైరెక్టర్లు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!