
ఎంఆర్పీ ధరలకు మించి ఎరువులు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు హెచ్చరించారు. విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న పలు ఎరువుల షాపులను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ…
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 21.55 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేశామన్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రైవేట్ డీలర్లు అధిక ధరలకు అమ్మితే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.