A2Z सभी खबर सभी जिले की

37.550 కిలోల గంజాయితో ఇద్దరు నిందితులను అరెస్టు

*-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

విజయనగరం జిల్లా డెంకాడ మండలం, చింతలవలస 5వ బెటాలియన్ గేటు సమీపంలో డెంకాడ పోలీసులు మరియు ఈగల్ బృందంకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టి, మారుతి 800 కారులో ఒడిస్సా రాష్ట్రం నుండి విశాఖపట్నం తరలిస్తున్న 37.550 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు, పరారీ అయిన మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా డెంకాడ సర్కిల్ ఆఫీసులో జూలై 16న నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ మాట్లాడుతూ – జూలై 15న డెంకాడ పోలీసులు మరియు ఈగల్ బృందానికి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు చింతలవలస 5వ బెటాలియన్ మెయిన్ గేటు సమీపంలో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టగా, విజయనగరం వైపు నుండి వస్తున్న మారుతి సుజికి 800 కారు ఒఆర్ 02 కే 7523 కారులో వస్తున్న ఇద్దరు వ్యక్తులు (ఎ-1) కోరాపుట్ జిల్లా నందాపూర్ బ్లాక్, రైజింగు పంచాయతీ, కతబర గ్రామానికి చెందిన బసుదేవ్ సిసా అలియాస్ భాస్కర్ గొల్లారి (22సం.లు) (ఎ-2) కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్, చందక గ్రామానికి చెందిన అజయ్ గుంట (19సం.లు) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, కారులోని 37.550 కిలోల గంజాయి, మారుతీ కారును సీజ్ చేసారన్నారు. పట్టుబడిన నిందితులను విచారణ చేయగా వారికి ముందు పైలట్గా మరో నిందితుడు (ఎ-3) రాజేష్ అలియాస్ గణేష్ అనే వ్యక్తి వెళ్ళినట్లు, సదరు వ్యక్తి తమను గంజాయిని తరలించేందుకు ఒప్పందం కుదిర్చినట్లు, అందుకు తమకు ఒక్కొక్కరికి రూ. 5వేలు ఇచ్చినట్లుగా వెల్లడించారన్నారు. పరారైనన నిందితుడు రాజేష్ అలియాస్ గణేష్ ను అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణను తీవ్రంగా పరిగణిస్తున్నామని, కారకులైన వారిని కేసుల్లో నిందితులుగా చేర్చుతున్నామన్నారు. గంజాయి వ్యాపారంతో ఆస్తులను అక్రమంగా కూడబెడితే వారి ఆస్తులను ఫ్రీజ్ చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ తరహా నేరాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన ముగ్గురు నిందితులకు చెందిన సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఫ్రీజ్ చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, భోగాపురం సిఐ జి.రామకృష్ణ, డెంకాడ ఎస్ఐ ఎ.సన్యాసి నాయుడు, ఈగల్ బృందాన్ని మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.

Back to top button
error: Content is protected !!