
పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న పోలీసు ఉద్యోగులు, హోంగార్డ్సు ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూలై 16న తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది. హోంగార్డ్సు మరియు ఇతర ఉద్యోగులు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోక పోవడం వలన వారిలో ఆరోగ్య సమస్యలను గుర్తించక అర్ధంతరంగా అస్వస్థతతకు గురికావడం, మృతి చెందడం జరుగుతుందన్నారు. ఇటీవల కాలంలో ఈ సమస్య మరింత తీవ్ర రూపందాల్చిన కారణంగా జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులు చిన్న వయస్సులోనే అర్ధాంతరంగా మృత్యువాత పడ్డారన్నారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా పోలీసు శాఖలో పని చేస్తున్న పైస్థాయి అధికారుల నుండి హోంగార్డు వరకు, మినిస్టీరియల్ సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీసు ఉద్యోగుల వైద్య పరీక్షల రిపోర్టులను కూడా డిజిటలైజ్ చేసి, భద్రపర్చి, ప్రతీ ఏడాది వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించి, వారి ఆరోగ్యంపై అప్రమత్తం చేస్తామన్నారు. పోలీసు సిబ్బంది కూడా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలను సకాలంలో చేసుకోవాలని, దాక్టర్లు సూచించిన సలహాలను పాటించాలని, తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలని పోలీసు ఉద్యోగులకు జిల్లా ఎస్పీ సూచించారు. పోలీసు సిబ్బందికి ఫాస్టింగ్ సుగర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లిపిడ్ ప్రొఫైల్ (కొలిస్ట్రాల్), సీరం క్రియేట్ (కిడ్నీ), ఈ.సి.జి. వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించి, రిపోర్టులను పరిశీలించి, ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగుల కు తదుపరి చికిత్స అందించడంతోపాటు, వైద్యపరమైన సలహాలను, సూచనలను అందించడానికి ఒక ప్రత్యేక వైద్యుడిని కూడా నియమించానున్నారు. జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న మమారు 2000 నుండి పోలీసు సిబ్బందికి ఈ మాసాంతరంలోగా వైద్య పరీక్షలు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించానుని, పోలీసు ఉద్యోగులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. పోలీసు ఉద్యోగుల సౌలభ్యం కోసం జిల్లా కేంద్రంలోని మెడికవర్, స్కాన్యూ టేజ్లోను, బొబ్బిలిలోని క్వీన్ ఎన్.ఆర్.ఐ., రాజాంలోని జి. ఎం. ఆర్. వరలక్ష్మి కేర్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, అదనపు ఎస్పీ (ఎఆర్) జి.నాగేశ్వరరావు, తిరుమల మెడికవర్ సెంట్రల్ హెడ్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అఖిల్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజేష్, విజయనగరం స్కాన్యు ఎండి వి.గోవర్ధన్, మేనేజర్ సిరి కృష్ణ మరియు ఆసుపత్రి సిబ్బంది, ఎఆర్ డిఎస్పీ వై.రవీంద్ర రెడ్డి, ఎస్బి సిఐ ఎ.వి. లీలారావు, ఆర్ఐలు ఎన్. గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి.శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.