
విజయనగరం పట్టణము చెందిన ఒక వివాహిత స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించి, ఆమె భర్తపై దాడికి పాల్పడిన కేసులో పట్టణానికి చెందిన నిందితుడు పోలాకి గౌరీ శంకర్ @ శంకర్ ను అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లు వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ జులై 7న తెలిపారు.విజయనగరం పట్టణంకు చెందిన ఒక వివాహిత జూలై 4న స్నానం చేస్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన పోలాకి గౌరీ శంకర్ @ శంకర్ అనే వ్యక్తి వీడియో చిత్రీకరించినట్లు, ఆమె గమనించి కేకలు వేయగా, అతడు పరారీ అయినట్లు, విషయం భర్తకు తెలపగా, భర్త అతడిని పట్టుకొని, మొబైల్ తీసుకొనగా, నిందితుడు గౌరీ శంకర్ తన భర్తపై దాడి చేసి, కొట్టి, తన భర్త మొబైల్ పట్టుకొని వెళ్ళిపోయినట్లుగా అతడిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాది వద్ద గల నిందితుడి మొబైల్ ను వన్ టౌన్ పోలీసులకు తదుపరి చర్యల నిమిత్తం అప్పగించారు.ఈ ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించి, పరారీలో ఉన్న నిందితుడు పోలాకి గౌరీ శంకర్ @ శంకర్ ను జూలై 7న అరెస్టు చేసి, అతని వద్ద నుండి ఫిర్యాది భర్తకు చెందిన మొబైల్ ఫోను రికవరీ చేసి, రిమాండుకు తరలించామని వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ హెచ్చరించారు.