
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు శ్రీకాకుళం 1వ ADJ జడ్జ్ భాస్కరరావు 4 ఏళ్ల జైలు శిక్ష రూ.10 వేలు జరిమానా విధించినట్లు SP వకుల్ జిందాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
రేగిడి ఆముదాలవలస స్టేషన్ పరిధిలో 2023లో గంజాయి తరలిస్తూ వి.రాంబాబు పట్టుబడ్డాడన్నారు.
అతనిని విచారించగా ఈ కేసుతో సంబంధమున్న వెంకటేష్, జీనా బంధుసిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.