
విజయగరం వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రక్రియ జరుగుతుంది. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో హెల్త్ కార్యదర్శులు, ANMలు సంయుక్తంగా ఫీవర్ సర్వే చేపడుతున్నారు. సచివాలయాల పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరిని పరీక్షించి జ్వర పీడితులు ఉన్నారా లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. కమిషనర్ మాట్లాడుతూ… వర్షాలు కురుస్తున్న నేపద్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.