బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని SP వకుల్ జిందాల్ అన్నారు. SP కార్యాలయంలో ఆయన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి 40 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు చెందినవి 13, కుటుంబ కలహాలు 4, మోసాలకు పాల్పడినవి 5, ఇతర అంశాలకు సంబంధించి 18 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి 7 రోజుల్లో పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.