
విజయనగరం లోని పార్టీ ఆఫీస్ లో జరిగిన జనసేన పార్టీ లో చేరికల కార్యక్రమం ఘనంగా ముగిసింది. విజయనగరం నియోజకవర్గం జొన్నవలస గ్రామం లో 25 కుటుంబాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీ లో చేరడం జరిగింది,ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పలువురు యువ నాయకులు, సీనియర్ నాయకులు, మన జనసేన పార్టీ విజయనగరం నియోజకవర్గం లో అధికారికంగా చేరారు.
వారి చేరికతో విజయనగరం నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి గారి నాయకత్వం లో పార్టీ బలంగా మారుతుందన్న నమ్మకాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. జనసేన పార్టీ విజయనగరం నియోజకవర్గం ఇంచార్జి & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారు స్వయంగా కొత్త సభ్యులను కండువాలతో సత్కరించి వారిని స్వాగతించారు. ఈ సందర్భంగా పార్టీ విధానం, అభివృద్ధి లక్ష్యాలపై ప్రసంగాలు కూడా జరిగాయి
ఈ కార్యక్రమం లో విజయనగరం నియోజకవర్గం టౌన్, మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు.