
వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడిందని APSDMA తెలిపింది. ఇది ఉత్తరదిశగా నెమ్మదిగా కదులుతూ వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందంది. గురువారం వాయుగుండంగా మారేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో భారీ వర్తాలు కురుస్తున్నాయి.