A2Z सभी खबर सभी जिले की

నెల రోజుల్లో కొత్త అక్రిడిటేషన్లు.

తక్షణమే ఉన్న కార్డుల గడువు పొడిగింపు కు ఉత్తర్వులు

 

 

ఏపీయూడబ్లూజే నేతలకు
ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా హామీవచ్చే నెల రోజుల్లో గా అర్హులైన జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని, ప్రస్తుతం ఉన్న కార్డులు రెన్యువల్ చేస్తామని ఐ అండ్ పి ఆర్ డైరెక్టర్ హిమాన్స్ శుక్లా చెప్పారు.

Related Articles

అక్రిడేషన్ల గడువు పొడిగింపు, కొత్త కార్డులు మంజూరు తదితర అంశాలపై మంగళవారం మధ్యాహ్నం సమాచారం శాఖ డైరెక్టర్ హిమాంశు శుక్లా గారిని ఏపీయూడబ్ల్యూజే నాయకులు కలిశారు. ప్రస్తుతం ఉన్న అక్రిడేషన్ ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో వాటిని తక్షణమే రెన్యువల్ చేయాలని, ఈనెల 30,31 తేదీలు ఆర్టీసీ కి సెలవు దినాలు అయినందున తక్షణమే బస్ పాస్ లు రెన్యువల్ కు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మరోసారి అక్రిడిటేషన్ పొడిగింపు కు అవకాశం లేకుండా రెగ్యులర్ గా ఇచ్చే కొత్త అక్రిడేషన్ల ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని డైరెక్టర్ ను కోరారు. దీనిపై స్పందించిన డైరెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ఈ రోజే అక్రిడిటేషన్ల గడువు పొడిగింపు ఫైలు పంపిస్తామని చెప్పారు. అలాగే జర్నలిస్టులు ఇబ్బంది పడకుండా ఈనెల 30వ తేదీ లోపే బస్ పాస్ లు రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రెండు లేక మూడు నెలల కాలానికి అక్రిడేషన్లను రెన్యువల్ చేస్తామని, అయితే ఈలోపే రెగ్యులర్ అక్రిడేషన్ల ప్రక్రియ కూడా నెల రోజుల్లోగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అక్రిడేషన్లపై నియమించిన మంత్రుల కమిటీ కూడా దీనిపైన ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపిందని, త్వరలో నే అక్రిడిటేషన్ కమిటీ జీవో వెలువడుతుందని శుక్లా తెలిపారు.
డైరెక్టర్ ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కమిటీ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచల జయరాజ్, కార్యదర్శి దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, ఐజేయూ సభ్యులు షేక్ బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆర్ రఘు, జి రామారావు, ఎం కోటిరెడ్డి పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!