A2Z सभी खबर सभी जिले की

పింఛను ఇప్పించండయ్యా పుణ్యం ఉంటుంది వార్తకు స్పందించిన అధికారులు

రేషన్, పింఛన్ సదుపాయం కల్పిస్తానన్న అధికారులు

మెంటాడ,: గుర్ల తమ్మి రాజుపేట గ్రామం శారీరక అంగవైకల్యంతో ఎస్టి ఎరుకల కులానికి చెందిన గొర్రెల నాగమణి పత్రికల ద్వారా తెలియజేసిన తన ఆవేదన ఫలించింది. ఈనెల 15వ తేదీన అయ్యా పించను ఇప్పించండయ్యా పుణ్యం ఉంటుంది వార్తకు అధికారులు స్పందించారు. ఎంపీడీవో భానుమూర్తి సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మానసిక అంగవైకల్యం కలిగినప్పటికీ ఎందుకు పించను, రేషన్ రావడం లేదో ఆరా తీశారు. సంబంధిత అధికారులతో గుర్ల తమ్మి రాజుపేట గ్రామ సచివాలయంలో క్షేత్రస్థాయి అధికారులను పిలిపించి ఆమె యొక్క పూర్తి వివరాలను సేకరించి ఎప్పటినుండి కుటుంబంతో కలిసి ఉంది, ఎప్పటి వరకు తల్లిదండ్రులతో కలిసి రేషన్ కార్డులో ఉంది, ఎంత కాలం నుండి రేషన్ అందడం లేదు, ఎందుకు ఆమె పేరు తొలగించారో అన్ని విషయాలను రికార్డులను పరిశీలన చేసి తదుపరి పింఛన్ రేషన్ ఇవ్వటానికి నిర్ణయించినట్లు స్థానిక పత్రిక విలేకరులకు తెలిపారు. మండల తాసిల్దార్ సెలవులో ఉండడం వలన కొద్ది సమయం పడుతుందనీ ఆయనతో కూడా చర్చించి రేషన్ కార్డు పొందే లాగున , పింఛన్ వచ్చేలాగున కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శారీరక అంగవైకల్యం కలిగిన నన్ను అధికారులు గుర్తించి రేషన్ పింఛన్ సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బాధితురాలు గొర్లె నాగమణి అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణ అధికారి విమల, గ్రామ పంచాయతీ కార్యదర్శి ముత్యాల నాయుడు, వీఆర్వో భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

Show More
Back to top button