
జిఎస్‌టి 2.0తో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని ఎపిఈపిడిసిఎల్ సూపరింటిండెంట్ ఇంజనీర్ ఎం.లక్ష్మణరావు అన్నారు. ఎపిఈపిడిసిఎల్ ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యుత్ భవన్ నుంచి కోట మీదుగా బాలాజీ జంక్షన్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ లక్ష్మణరావు మాట్లాడుతూ, జిఎస్‌టి తగ్గింపును ప్రతీఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
